త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seating Row | మీడియా స‌మావేశంలో కుర్చీ కోసం లొల్లి.. జిల్లా మాజీ అధ్య‌క్షుడి చెంప చెల్లుమ‌నిపించిన నేత‌

Seating Row | మీడియా స‌మావేశంలో సీటు (Seating Row) కోసం జ‌రిగిన లొల్లి తీవ్ర గంగ‌ద‌ర‌గోళం సృష్టించింది. సీటు విష‌య‌మై ఇరువురు నేత‌ల మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం ప‌ర‌స్ప‌ర దాడికి దారితీసింది. ఈ క్ర‌మంలో ఓ నాయ‌కుడు పార్టీ జిల్లా మాజీ అధ్య‌క్షుడి చెంప ప‌గుల‌గొట్టాడు (Slapped).

G

National | Published On Oct 4, 2026, 9.54 am IST

Seating Row | మీడియా స‌మావేశంలో కుర్చీ కోసం లొల్లి.. జిల్లా మాజీ అధ్య‌క్షుడి చెంప చెల్లుమ‌నిపించిన నేత‌
Advertisement

Seating Row | త్రినేత్ర న్యూస్‌: మీడియా స‌మావేశంలో సీటు (Seating Row) కోసం జ‌రిగిన లొల్లి తీవ్ర గంగ‌ద‌ర‌గోళం సృష్టించింది. సీటు విష‌య‌మై ఇరువురు నేత‌ల మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం ప‌ర‌స్ప‌ర దాడికి దారితీసింది. ఈ క్ర‌మంలో ఓ నాయ‌కుడు పార్టీ జిల్లా మాజీ అధ్య‌క్షుడి చెంప ప‌గుల‌గొట్టాడు (Slapped). దీంతో ప్రెస్ మీట్ కాస్త ర‌ణ‌రంగంగా మారింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌లో (Gorakhpur) జ‌రిగింది.

ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ వారం (Save Democracy Week) పేరుతో స‌మాజ్‌వాదీ పార్టీ (SP) వారం రోజుల పాటు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మం గురించి వివ‌రించేందుకు గోర‌ఖ్‌పూర్‌లో మీడియా స‌మావేశం (Press Meet) నిర్వంహించారు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడు బ్రిజేశ్ గౌత‌మ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి పెద్ద సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అయితే సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో జిల్లా మాజీ అధ్యక్షుడు నాగినా సహాని, పార్టీ నేత అంశుమాన్ సింగ్ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణ త‌లెత్తింది. ఇరువురు ప‌క్షాలు ఒక‌రినొక‌రు తోసుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ రూరల్ నియోజకవర్గం నుంచి ఎస్పీ టికెట్ ఆశిస్తున్న అంశుమాన్ సింగ్ కుమారుడు కమలేశ్‌ సింగ్.. నాగినా సహానిపై చేయి చేసుకున్నారు. ప‌రిస్థితి చేయిదాటిపోతుండ‌టంతో క‌లుగ‌జేసుకున్న సీనియర్ నాయకులు.. ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement