త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్‌..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధ ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశీయ‌, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు న‌ష్టాల్లో ఉండ‌గా, గ‌త 10 రోజుల నుంచి బంగారం, వెండి ధ‌ర‌లు మాత్రం ప‌రుగులు పెట్టాయి. ఆల్ టైం హై నుంచి చాలా దిగువ‌కు ఈ లోహాల రేట్లు రావ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం క‌నిపించింది.

S

Business | Published On Aug 25, 2026, 11.29 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్‌..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధ ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశీయ‌, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు న‌ష్టాల్లో ఉండ‌గా, గ‌త 10 రోజుల నుంచి బంగారం, వెండి ధ‌ర‌లు మాత్రం ప‌రుగులు పెట్టాయి. ఆల్ టైం హై నుంచి చాలా దిగువ‌కు ఈ లోహాల రేట్లు రావ‌డంతో పెట్టుబ‌డిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం క‌నిపించింది. అయితే మంగ‌ళ‌వారం సెష‌న్‌లో పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణకు మొగ్గు చూప‌డంతో ఆయా లోహాల ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.26 శాతం త‌గ్గి 4,638 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 1.57 శాతం ప‌త‌న‌మై 67 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 52 పాయింట్లు స్వ‌ల్పంగా త‌గ్గి 1,63,177 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1252 పాయింట్లు త‌గ్గి 2,42,968 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గగా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.16,375 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,31, 000 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,63,750 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.16,37,500 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,200 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,010 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,20,080గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,50,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,01,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,281 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.98,248గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,22,810 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,28,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,650 గా ఉంది.

Advertisement
Advertisement