త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Double Standards | అమెరికా ప‌ర్య‌ట‌న‌.. రేవంత్‌కు నో.. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి అనుమ‌తి.. కేంద్రం వైఖ‌రిపై ఐఓసీ ఫైర్‌

Double Standards | అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డంతో మ‌రికొన్ని గంట‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైద‌రాబాద్ చేరుకోనున్నారు. రాజ‌కీయ కోణంలోనే సీఎం అమెరికా ప‌ర్య‌ట‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

G

Telangana | Published On Aug 23, 2026, 1.06 pm IST

Double Standards | అమెరికా ప‌ర్య‌ట‌న‌.. రేవంత్‌కు నో.. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి అనుమ‌తి.. కేంద్రం వైఖ‌రిపై ఐఓసీ ఫైర్‌
Advertisement

Double Standards | త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డంతో మ‌రికొన్ని గంట‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైద‌రాబాద్ చేరుకోనున్నారు. రాజ‌కీయ కోణంలోనే సీఎం అమెరికా ప‌ర్య‌ట‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ముఖ్య‌మంత్రి హోదాకు త‌గిన స్థాయిలో లేదంటూ రేవంత్ యూఎస్ (USA) టూర్‌కు మోకాల‌డ్డిన విదేశాంగ శాఖ‌.. అదే కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు త‌మ పార్టీకి చెందిన గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్‌కు (Bhupendra Patel) మాత్రం ఓకే చెప్పింది. ఇది కేంద్రంలోని బీజేపీ (BJP) స‌ర్కార్ అనుస‌రిస్తున్న ద్వంద్వ నీతికి (Double Standards) నిద‌ర్శ‌న‌మ‌ని ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (IOC) అమెరికా విభాగం ఆరోపించింది. గుజరాత్‌ సీఎం అమెరికా పర్యటనకు అనుమతించి.. తెలంగాణ ముఖ్యమంత్రిని నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిపై ఆంక్షలు విధిస్తూ బీజేపీ ముఖ్యమంత్రికి మాత్రం అమెరికా వెళ్లేందుకు అనుమతించడమే విదేశాంగవిధానమా అని కేంద్రాన్ని నిలదీసింది.

రాష్ట్రాల అభివృద్ధి, విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని పేర్కొంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు మద్దతివ్వాలని కోరింది. తెలంగాణ అభివృద్ధి కోసం విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల అవకాశాలపై ప్రభావం చూపుతుందని ఐఓసీ ఆందోళన వ్యక్తం చేసింది.

షెడ్యూల్ ప్ర‌కార‌మే అధికారుల ప‌ర్య‌ట‌న‌

ఈ నెల 20 నుంచి 30 వ‌ర‌కు ప‌ది రోజుల‌పాటు యూకే, అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్య‌టించాల్సి ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం లండ‌న్‌లో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి.. అమెరికా వెళ్లేందుకు విదేశాంగ శాఖ అనుమ‌తించిక‌పోవ‌డంతో హైద‌రాబాద్‌కు తిరుగుప‌య‌న‌మ‌య్యారు. అయితే హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నార్త్‌ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్‌ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం భావించారు. అయితే, ప్రతిపాదిత కార్యక్రమాలు ముఖ్యమంత్రి హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగిన స్థాయిలో లేవని విదేశాంగ శాఖ పేర్కొంది. సీఎం పర్యటన రద్దయినా.. అధికారుల బృందం అమెరికాలో ముందుగా ఖరారైన కార్యక్రమాల్లో పాల్గొననుంది.

Advertisement
Advertisement