త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Milk Packets | పాల ప్యాకెట్లు వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా..?

Milk Packets | మీరు నిత్యం పాల‌ను( Milk ) వినియోగిస్తున్నారా..? అయితే మీకు ఈ అనుమానం ఎప్పుడు రాలేదా..? పాల ప్యాకెట్లు ఎందుకు వివిధ రంగుల్లో ఉంటాయ‌నే అనుమానం. అయితే పాల ప్యాకెట్లు( Milk Packets ) వివిధ రంగుల్లో ఉండ‌డానికి క‌చ్చిత‌మైన కార‌ణం ఉంద‌నే విష‌యం ఈ క‌థ‌నంలో తెలుసుకోండి..

S

National | Published On Jun 12, 2026, 8.44 am IST

Milk Packets | పాల ప్యాకెట్లు వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా..?
Advertisement

Milk Packets | త్రినేత్ర‌.న్యూస్ : భార‌త‌దేశంలో అనేక పాల ఉత్ప‌త్తి సంస్థ‌లు( Dairy Companies ) ఉన్నాయి. ఈ సంస్థ‌ల‌న్నీ కూడా పాల‌ను ప్యాకెట్ల( Milk Packets ) రూపంలో ప్ర‌జ‌ల‌కు విక్ర‌యిస్తుంటాయి. అయితే ఈ పాల ప్యాకెట్లు ఐదారు రంగుల్లో క‌నిపిస్తుంటాయి. ప్ర‌ధానంగా గ్రీన్, బ్లూ, ఆరెంజ్, ప‌ర్పుల్, వైట్ క‌ల‌ర్స్‌లో పాల ప్యాకెట్లు ఉంటాయి. మ‌రి ఈ రంగులు ఊరిక‌నే పెట్టారా..? దీని వెనుకాల ఏదైనా శాస్త్రీయ కోణం ఉందా..? అన్న విష‌యాలు ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా దేశ వ్యాప్తంగా ఉన్న‌ డెయిరీ కంపెనీలు.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్, రెడ్ క‌ల‌ర్స్‌లో ఉన్న ప్యాకెట్ల‌ను పాల‌ను ప్యాక్ చేసి విక్ర‌యిస్తున్నాయి. అయితే చాలా మంది పాల‌ను కొనుగోలు చేసే స‌మ‌యంలో ఆ క‌ల‌ర్ రంగు పేరు చెప్పి పాల‌ను కొనుగోలు చేస్తుంటారు. ఇది షాపు య‌జ‌మానికి కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఈ రంగుల వెనుకాల శాస్త్రీయ‌త కూడా ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI ) పాల‌కు సంబంధించి కొన్ని ప్ర‌మాణాల‌ను పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆయా రంగుల్లో ఉన్న ప్యాకెట్ల‌ను పాల‌ను ప్యాక్ చేసి విక్ర‌యించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

బ్లూ క‌ల‌ర్ ప్యాకెట్

అమూల్, మ‌ద‌ర్ డెయిరీ, విజ‌య డెయిరీ, అవిన్‌తో పాటు ప‌లు డెయిరీ సంస్థ‌లు ప్ర‌త్యేక రంగుల్లో పాల‌ను ప్యాకెట్ల‌ను రూపొందిస్తున్నాయి. అయితే బ్లూ ప్యాకెట్ల‌లో ల‌భించే పాల‌ను టోన్డ్ మిల్క్‌గా ప‌రిగ‌ణించాలి. ఈ పాల‌ల్లో 3 శాతం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది.

గ్రీన్ క‌ల‌ర్ ప్యాకెట్

గ్రీన్ ప్యాకెట్ల‌లో ల‌భించే పాల‌ను స్టాండ‌ర్‌డైజ్డ్ మిల్క్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ పాల‌ల్లో 4.5 శాతం వ‌ర‌కు ఫ్యాట్ కంటెంట్ ఉంది.

ఆరెంజ్ క‌ల‌ర్ ప్యాకెట్

ఇక ఆరెంజ్ ప్యాకెట్ల‌లో ల‌భించే పాల‌ల్లో ఫుల్ క్రీమ్ మిల్క్‌ను నిల్వ చేస్తున్నారు. ఈ పాల‌ల్లో 6 శాతం వ‌ర‌కు ఫ్యాట్ ఉంటుంది.

ప‌ర్పుల్, మెజెంటా క‌ల‌ర్ ప్యాకెట్లు

ఇక కొన్ని డెయిరీ సంస్థ‌లు ప‌ర్పుల్, మెజెంటా రంగుల‌తో కూడిన ప్యాకెట్ల‌లో పాల‌ను విక్ర‌యిస్తున్నాయి. ఇవి డ‌బుల్ టోన్డ్ మిల్క్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. వీటిల్లో అతి త‌క్కువ‌గా ఫ్యాట్ ఉంటుంది.

ఇక వినియోగ‌దారులు కూడా త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా పాల ప్యాకెట్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. టీ, కాఫీల కోసం ఒక ర‌క‌మైన పాల‌ను, పిల్ల‌ల‌కు ఒక ర‌క‌మైన పాల‌ను, పెరుగు, స్వీట్ల త‌యారీకి మ‌రో ర‌క‌మైన పాల‌ను వినియోగిస్తున్నారు.

అయితే ఇలా ప్ర‌త్యేక రంగుల్లో పాల ప్యాకెట్లు ఉండ‌డం వ‌ల్ల ప్ర‌తిసారి ఆ పాలల్లో ఉన్న కొవ్వు శాతంతో పాటు ఇత‌ర వివ‌రాల‌ను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే నిత్యం పాల‌ను కొనుగోలు చేసే వినియోగ‌దారుడికి ఏ రంగు పాల ప్యాకెట్‌లో ఎంత కొవ్వు శాతం ఉంద‌నేది అర్థ‌మైపోతుంది. కాబ‌ట్టి పాల షాపుకు వెళ్లి నేరుగా త‌న‌కు కావాల్సిన పాల‌ను అంటే రంగును చూసి కొనుగోలు చేస్తుంటారు. ఇది ఎంతో తేలిక అనే భావ‌న కూడా చాలా మందిలో ఉంది.

Advertisement
Advertisement