Cyclone Arnab | సంక్రాంతికి పొంచి ఉన్న వాయుగండం.. నేడు తుఫానుగా మారే అవకాశం
సంక్రాంతి పండుగ ముందు దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం (Cyclone) ముప్పు పొంచి ఉన్నది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలపడింది. శుక్రవారం అది తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
Andhra pradesh | Published On Jan 9, 2026, 9.30 am IST
trinethra.news : సంక్రాంతి పండుగ ముందు దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం (Low Pressure) ముప్పు పొంచి ఉన్నది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలపడింది. శుక్రవారం అది తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. శ్రీలంక తీరం వైపు దూసుకొస్తున్నదని వెల్లడించింది. గురువారం సాయంత్రానికి కరైకల్ (పుదుచ్చేరి)కు 780, చెన్నైకి 940 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
పరిస్థితులు అనుకూలిస్తే తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందుందని ఐఎండీ అంచనా వేస్తున్నది. ఒకవేళ అది తుఫానుగా మారితే దానికి ‘ఓర్ణబ్ (అర్ణబ్)’గా (Cyclone Arnab) నామకరణం చేయనున్నారు. ఓర్ణబ్ అంటే సముద్రం అని అర్ధం. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది.
ఇది వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంకలో పొట్టువిల్, ట్రింకోమలి మధ్యలో శుక్రవారం రాత్రి తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






