Cold Wave | తెలంగాణలో చలి పులి పంజా.. సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు
రాష్ట్రంపై చలి పులి పంజా (Cold Wave) విసురుతున్నది. సంగారెడ్డి, కుమ్రం భీం, రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఒకవైపు ఎండ ఉన్నప్పటికీ చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
trinethra.news : రాష్ట్రంపై చలి పులి పంజా (Cold Wave) విసురుతున్నది. తూర్పు దిశ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయాయి. సంగారెడ్డి, కుమ్రం భీం, రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఒకవైపు ఎండ ఉన్నప్పటికీ చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో అతితక్కువగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.6 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక కుమ్రం భీం జిల్లా తిర్యాణిలో 7.1 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో 7.2 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 8.1, వికారాబాద్ జిల్లా మర్పల్లెలో 8.2, ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో 8.3, సిరిసిల్ల జిల్లా గంబీరావ్‌పేటలో 9.1, సిద్దిపేట జిల్లా మర్కూక్‌లో 9.2, మెదక్ జిల్లా యెల్దుర్తిలో 9.4, ములుగు జిల్లా తాడ్వాయిలో 9.6, నిజామాబాద్ జిల్లా సాలూరలో 9.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అతితక్కువగా హెచ్‌సీయూలో 8.4 డిగ్రీలు, మౌలాలీలో 8.8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 8.9, కుత్భుల్లాపూర్‌లో 10.7, అల్వాల్‌లో 11, శివరామ్‌పల్లిలో 11.2, వెస్ట్ మారేడ్‌పల్లిలో 11.2, మచ్చ బొల్లారంలో 11.3, జీడిమెట్ల 12, గచ్చిబౌలిలో 12.1, కిషన్‌బాఘ్‌లో 12.2, మెహిదీపట్నంలో 12.4, బేగంపేటలో 12.5, నేరేడ్‌మెట్, హయత్‌నగర్, నాగోల్‌లో 12.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
INTENSE COLDWAVE CONTINUES 🥶
Jan 9 2026More 36hrs of COLDWAVE, thereafter respite from COLDWAVE ahead 🥶👍
GHMC toppers
HCU Serlingampally 8.4°C
MoulaAli 8.8
Rajendranagar 8.9
Qutbullapur 10.7
Alwal 11
Sivarampalle 11.2
West Maredpally 11.2
Macha Bollaram 11.3
Jeedimetla…— Telangana Weatherman (@balaji25_t) January 9, 2026
తాజావార్తలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?





