త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | క్రూడ్ ధరల మంట.. మార్కెట్లకు భారీ షాక్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. పలు కారణాలతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 0.5 శాతం వరకు పడిపోయాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 407.58 పాయింట్లు (0.54 శాతం) నష్టపోయి 75,725.23 వద్ద, నిఫ్టీ 106.95 పాయింట్లు (0.45 శాతం) క్షీణించి 23,672.20 వద్ద ట్రేడయ్యాయి.

S

Business | Published On Sep 8, 2026, 10.26 am IST

Stock Markets | క్రూడ్ ధరల మంట.. మార్కెట్లకు భారీ షాక్..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. పలు కారణాలతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 0.5 శాతం వరకు పడిపోయాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 407.58 పాయింట్లు (0.54 శాతం) నష్టపోయి 75,725.23 వద్ద, నిఫ్టీ 106.95 పాయింట్లు (0.45 శాతం) క్షీణించి 23,672.20 వద్ద ట్రేడయ్యాయి. ఈ సమయంలో 1,524 షేర్లు లాభాల్లో ఉండగా, 1,520 షేర్లు నష్టాల్లో, 178 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగాయి. మార్కెట్లపై ప్రధానంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం చూపుతోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత విస్తరించే అవకాశాల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. టెహ్రాన్‌పై కొత్త దాడులు జరిగితే అమెరికా ఆస్తులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలతోపాటు అమెరికాకు చెందిన చమురు, గ్యాస్ ప్రయోజనాలు కూడా తమ దాడులకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఈ పరిణామాల నేపథ్యంలో క్రూడ్ ధ‌ర పెరిగింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు మంగ‌ళ‌వారం భారీగానే పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.24 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 99 డాల‌ర్ల‌కు స‌మీపించ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.33 శాతం పెరిగి బ్యారెల్‌కు 93 డాల‌ర్ల‌కు చేరువైంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌రోమారు బ‌ల‌హీన ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 94.68 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.22 శాతం న‌ష్ట‌పోయింది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నందున అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇక రియల్ ఎస్టేట్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. రియాల్టీ, ఐటీ షేర్లలో కనిపించిన బలహీనత సూచీలపై గణనీయమైన ఒత్తిడిని పెంచింది.

సాంకేతికంగా కూడా నిఫ్టీ కీలక స్థాయిలకు దిగువన ట్రేడవుతుండటం మార్కెట్‌లో జాగ్రత్త ధోరణికి కారణమవుతోంది. నిఫ్టీ 23,800 స్థాయిని అధిగమించినప్పుడే మార్కెట్లో మళ్లీ బుల్లిష్ మొమెంటమ్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement