Rafale Fighter Jets | 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
Rafale Fighter Jets | భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) కొనుగోళ్లకు సంబంధించి తాజాగా కీలక ముందడుగు పడింది.
Rafale Fighter Jets | భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) కొనుగోళ్లకు సంబంధించి తాజాగా కీలక ముందడుగు పడింది. రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం తాజాగా ఓకే చెప్పింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (Defence Acquisition Council C) ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈనెల 18న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు వస్తున్న వేళ.. ఈ కీలక ముందడుగు పడింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi), మాక్రాన్ మధ్య జరిగే సమావేశంలో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంది.
మన వైమానిక దళం వద్ద ప్రస్తుతం 36 రఫేల్స్ ఉన్నాయి. మరో 26 మెరైన్ వేరియంట్ల కోసం నేవీ ఆర్డర్ చేసింది. ఎం వర్షన్‌కు చెందిన ఆ యుద్ధ విమానాలను నౌకాదళం సుమారు 63 వేల కోట్లు ఖర్చుతో కొనేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో భారత వాయుసేలో చేరబోయే 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీటర్, 26 ట్విన్ సీటర్ వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో 100 యుద్ధ విమానాలను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద దేశీయంగానే తయారు చేయనున్నారు. ఇక వీటి రాకతో మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్ఠం కానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- ●Anaswara Rajan | చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘కాకా’ ఫస్ట్ లుక్ విడుదల
- ●Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
- ●Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష స్పందన.. 31 శాతం లాభం అంచనా..
- ●MLA Veerlapalli Shankar | కేసీఆర్ చనిపోవాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
- ●Leopard | గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో

Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

Anaswara Rajan | చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘కాకా’ ఫస్ట్ లుక్ విడుదల

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్

Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష స్పందన.. 31 శాతం లాభం అంచనా..






