KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా డా. రమేశ్ రెడ్డి నియామకం
KNRUHS | కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇంచార్జి వీసీగా డాక్టర్ రమేశ్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
KNRUHS | హైదరాబాద్ : కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇంచార్జి వీసీగా డాక్టర్ రమేశ్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రమేశ్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన డీఎంఈగా పని చేసిన అనుభవం ఉంది.
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఇటీవలే గవర్నర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖతో రేవంత్ సర్కార్‌లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డిపై సీరియస్ అయిన కాసేపటికే ఆయన వీసీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కొత్తగా డాక్టర్ రమేశ్ రెడ్డిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా నియమించింది రేవంత్ సర్కార్.
అసలు వివాదం ఏంటంటే..?
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీకి చెందిన కొంతమంది విద్యార్థులు తమ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వారు నేరుగా హెల్త్ యూనివర్సిటీ వీసీని సంప్రదించి రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పీజీ పరీక్షల్లో రీ వాల్యూయేషన్‌కు అవకాశం లేదు. కేవలం రీకౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉంది. అయితే సదరు విద్యార్థులను రీవాల్యుయేషన్ పేరిట మళ్లీ పాస్ చేసినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కొందరు ఆరా తీయగా.. అసలు విషయం వెలుగు చూసింది.
పీజీ వైద్య పరీక్షల్లో విద్యార్థులకు జవాబులు రాసేందుకు 30 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. దానిపై విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. బుక్‌లెట్‌లో మిగిలిపోయిన పేజీలపై ఇంటూమార్క్ (కొట్టివేత)ను అధికారులు వేస్తారు. అలా క్రాస్‌మార్కింగ్ చేసిన తరువాతే ఇన్విజిలేటర్లు విద్యార్థుల ఆన్సర్‌షీట్లను తీసుకుంటారు. తర్వాత వాటిని స్కాన్ చేసి జంబ్లింగ్ పద్ధతిలో వివిధ కళాశాలలకు పంపుతారు. సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు వాటిని ఆన్‌లైన్‌లోనే దిద్దుతారు. ఈ ప్రక్రియ చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. ఇక సాఫ్ట్‌వేరే మొత్తం జవాబులకు వేసిన మార్కులను లెక్కిస్తుంది. అయితే, కొంతమంది విద్యార్థుల జవాబు పత్రాల్లో ఇంటూమార్క్ వేసిన పేజీల్లోనే జవాబులు రాసి ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. కొట్టివేసిన ఇంటూమార్క్ ఉన్న పేజీల్లో రాసిన జవాబులను లెక్కలోకి తీసుకోరు. కానీ, ఆయా జవాబులకు మళ్లీ మార్కులు వేసి పాస్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






