Philosophy Professor | చిల్లర అడిగితే చెవి పగిలేలా కొట్టాడు.. ఫిలాసఫి ప్రొఫెసర్‌పై షాప్ యజమాని అమానుషం
Professor | అతడు ఓ కాలేజీలో ప్రొఫెసర్ (Philosophy Professor). పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్లిన అతడిని.. చిల్లర తిరిగి ఇవ్వాలని అడగడంతో షాప్ యజమాని (Shopkeeper) కొడుకు చెవి పగిలేలా కొట్టాడు.
Professor | త్రినేత్ర.న్యూస్: అతడు ఓ కాలేజీలో ప్రొఫెసర్ (Philosophy Professor). పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్లిన అతడిని.. చిల్లర తిరిగి ఇవ్వాలని అడగడంతో షాప్ యజమాని (Shopkeeper) కొడుకు చెవి పగిలేలా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని చాప్రా సిటీలో (Chhapra City) జరిగింది.
భగవాన్ ఠాకూర్ (Bhagwan Thakur) అనే వ్యక్తి చాప్రా సిటీలోని నంద్ లాల్ సింగ్ కాలేజీలో ఫిలాసఫి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రోజూలానే తన నివాసం సమీపంలోని ఓ దుకాణంలో అర లీటర్ పాలు (Milk) కొనడానికి వెళ్లారు. దుకాణ దారుడు పాల ప్యాకెట్ ఇవ్వడంతో.. ఠాకూర్ అతనికి రూ.500 ఇచ్చారు. దీంతో షాపు యజమాని రూ.450 తిరిగి ఇచ్చాడు. వాటిని తీసుకుని కొద్ది దూరం వెళ్లిన ఠాకూర్.. తనకు డబ్బు తక్కువగా ఇచ్చాడని గ్రహించి మళ్లీ షాప్ వద్దకు వెళ్లాడు. తన వద్ద రూ.450 చూపించి, ఇంకా రూ.15 ఇవ్వాలని షాపు యజమానిని అడిగారు.
దీంతో అతడు ఆ చిల్లర (Change) మొత్తం ఇవ్వడంతో దానిని తీసుకుంటుండగా.. ఒక్కసారిగా లోపలి నుంచి వచ్చిన దుకాణ దారుడి కుమారుడు ప్రొఫెసర్ చెవిపై బలంగా కొట్టాడు. దీంతో అమాంతం కింద పడిపోయారు. కష్టంపై తన తోటి అధ్యాపకుడికి ఫోన్ చేయడంతో అతడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఠాకూర్‌ను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. చిల్లర కోడం అడిగినందుకు చెవి పగిలేలా కొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
- ●Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర
- ●Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ
- ●Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!
- ●Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి
- ●Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..
- ●RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్

Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర

Vijay Devarakonda | ఈ వినాయక చవితికి విత్తన గణపతిని వాడుదాం.. నగరాన్ని కాలుష్యం నుంచి రక్షిద్దాం: విజయ్ దేవరకొండ

Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!

Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి






