త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ.. ఆ కోరిక తీర‌కుండానే అనంత లోకాల‌కు

Nagarmal Bajoria | చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్టాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. మంచి ప్ర‌జా నేత‌గా రాణించాల‌నే ప‌ట్టుద‌ల కూడా ఉంటుంది. క‌నీసం చివ‌ర‌కు గ్రామ స‌ర్పంచ్‌గా లేదంటే వార్డు మెంబ‌ర్‌గానైనా ఎన్నికై ప్ర‌జా సేవ చేయాల‌నే త‌ప‌న ఉంటుంది. అలాంటి వ్య‌క్తే ఈయ‌న‌.

S

National | Published On Sep 4, 2026, 10.39 pm IST

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ.. ఆ కోరిక తీర‌కుండానే అనంత లోకాల‌కు
Advertisement

Nagarmal Bajoria | త్రినేత్ర‌.న్యూస్ : చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్టాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. మంచి ప్ర‌జా నేత‌గా రాణించాల‌నే ప‌ట్టుద‌ల కూడా ఉంటుంది. క‌నీసం చివ‌ర‌కు గ్రామ స‌ర్పంచ్‌గా లేదంటే వార్డు మెంబ‌ర్‌గానైనా ఎన్నికై ప్ర‌జా సేవ చేయాల‌నే త‌ప‌న ఉంటుంది. అలాంటి వ్య‌క్తే ఈయ‌న‌.

ధ‌ర్తీప‌క‌డ్‌గా పేరుగాంచిన ఎన్నిక‌ల యోధుడే నాగ‌ర్మ‌ల్ బజోరియా. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నుంచి మొద‌లుకుంటే దేశంలోని అత్యున్న‌త ప‌ద‌వి అయిన రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ‌ర‌కు పోటీ చేశారు.. కానీ ఏ ఒక్క ఎన్నిక‌లోనూ ఆయ‌న విజ‌యం సాధించ‌లేక‌పోయారు. ప్ర‌తి ఎన్నిక‌లో పోటీ చేసి చేసి అల‌సిపోయి చివ‌ర‌కు 97 ఏళ్ల వ‌య‌సులో క‌న్నుమూశారు ఆయ‌న‌.

బీహార్‌లోని భ‌గ‌ల్‌పూర్‌కు చెందిన నాగ‌ర్మ‌ల్ బ‌జోరియా(97) ప్ర‌జా సేవ చేయాల‌నే సంక‌ల్పం మ‌న‌సు నిండా ఉండేది. అందుకోసం ఎన్నిక ఏది అని చూడ‌కుండా.. పంచాయ‌తీ నుంచి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు బ‌రిలో దిగేవారు. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసేవారు.. నిజాయితీగా త‌న మేనిఫెస్టోను ప్ర‌క‌టించేవారు. కానీ ఆయ‌న ప్ర‌తి ఎన్నిక‌లోనూ ఓడిపోయారు. చివ‌ర‌కు రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ పోటీ చేసి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు. 300 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన బ‌జోరియా ఇటీవ‌ల తీవ్ర అనారోగ్యానికి గురై.. పాట్నాలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

30 ఏళ్ల వయసులో భాగల్‌పుర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఫలితమేదైనా సరే.. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని జీవితంలో భాగంగా ఎంచుకున్నారు. స్థానిక సంస్థలు మొదలు రాష్ట్రపతి ఎన్నికల వరకు అనేక స్థానాల్లో నాగర్మల్‌ పోటీ చేశారు. ఇందిరా, రాజీవ్‌ గాంధీలతోపాటు వాజ్‌పేయీ, ఎల్‌కే ఆడ్వాణీ, ప్రణబ్‌ ముఖర్జీ వంటి దిగ్గజ నేతలకు పోటీగా నిలబడ్డారు. అంతేకాదు.. 1969లో రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పోటీకి దిగారు. దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ఓటమి చెందిన ఆయన సుమారు 300 సార్లు బరిలో నిలవడం విశేషం.

కేవలం ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రచారంలోనూ ప్రత్యేక శైలి కనబరిచేవారు. చేతిలో గంటను పట్టుకొని మోగిస్తూ ప్రచారం నిర్వహించేవారు. గాడిదలతో ర్యాలీ నిర్వహించడం, అవినీతికి వ్యతిరేకంగా జంతువుల మెడకు నినాదాలు రాయడం వంటి వినూత్న చర్యలతో స్థానికుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు.

Advertisement
Advertisement