త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asaduddin Owaisi | అరుణాచల్‌లోకి చైనా చొచ్చుకొచ్చిందా..? కేంద్రంపై ఒవైసీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

Asaduddin Owaisi | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) సరిహద్దుల్లో తాజా ప‌రిస్థితిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) డిమాండ్ చేశారు. ఈ మేర‌కు అరుణాచల్‌లోకి చైనా (China) చొచ్చుకొచ్చిందా..? మన పెట్రోలింగ్ దళాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను పీఎల్‌ఏ ధ్వంసం చేసిందా..? అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

D

National | Published On Aug 17, 2026, 5.37 pm IST

Asaduddin Owaisi | అరుణాచల్‌లోకి చైనా చొచ్చుకొచ్చిందా..? కేంద్రంపై ఒవైసీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం
Advertisement

Asaduddin Owaisi | త్రినేత్ర‌.న్యూస్ : అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) సరిహద్దుల్లో చైనా (China) చొరబడిందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వాన్ని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పష్టత కోరారు. ఈ మేర‌కు మోదీ ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. స‌రిహ‌ద్దుల్లో చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (Peoples Liberation Army) దురాక్ర‌మ‌ణ‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కేంద్రాన్ని నిల‌దీశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేంద్రానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

స‌రిహ‌ద్దుల్లో మ‌న సైనిక ద‌ళాల‌ను పీఎల్ఏ అడ్డుకుంటోంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న సైన్యం గ‌స్తీ తిరిగిన ప్రాంతాల‌కు వెళ్ల‌కుండా నిరోధిస్తోంద‌ని ఆరోపించిన ఒవైసీ.. భారత భూభాగంలో మన పెట్రోలింగ్ దళాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను పీఎల్‌ఏ ధ్వంసం చేసిందా..? అని కేంద్రాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. మన సైన్యం ఇంతకుముందు గస్తీ తిరిగిన, స్పష్టంగా మన దేశ భూభాగమైన ప్రాంతంలో పీఎల్‌ఏ బలగాలు టెంట్లు వేసుకున్నాయా..? అని ప్ర‌శ్నించారు.

వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఢిల్లీ పర్యటనకు వీలు కల్పించేందుకు స‌రిహ‌ద్దుల్లో సాధారణ పరిస్థితి నెలకొందనే భావన కల్పించడానికి ఆ ప్రాంతంలో గస్తీ హక్కుల కోసం ప‌ట్టువ‌ద్ద‌ని సైన్యంపై ప్ర‌భుత్వం ఒత్తిడి తెస్తోందా..? అని ప్రశ్నించారు. 2017లో డోక్లామ్, 2020లో లడఖ్ విషయంలో చేసినట్లుగానే సరిహద్దులో చైనాతో జరుగుతున్న పరిణామాల గురించి తెలియకుండా భారత ప్రజలకు చీకటిలో ఉంచాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుందా..? అంటూ నిల‌దీశారు. ప్ర‌భుత్వాలు, ప్ర‌ధాన మంత్రులు వ‌స్తుంటారు, పోతుంటారని ఒవైసీ వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం అత్యంత పవిత్రమైనవని వాటి విష‌యంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Also Read..

మోదీ 'దిమాగీ నక్సల్' టు రాహుల్ 'వాట్సప్ యూనివర్సిటీ': ఏలుతున్న హాష్‌ట్యాగ్స్!

రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి

ఇంట్లో ఓవెన్‌ను వాడుతున్నారా.. ఈ త‌ప్పులు చేయొద్దు..

Advertisement
Advertisement