Parliament | ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన ఉభయసభలు
Parliament | అయోధ్యలోని రామమందిరంలో విరాళాల చోరీ, నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగం అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. ఆయా అంశాలపై విపక్షాలు పార్లమెంట్‌లో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఇవాళ కూడా ఉభయసభలు దద్దరిల్లాయి.
- అయోధ్య రామాలయం విరాళాల చోరీపై వీధి నాటకం
- పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల వినూత్న నిరసన
- సన్యాసి వేశం ధరించిన పప్పూ యాదవ్
- పెల్లెట్ గన్స్‌కు ఆదేశాలెవరిచ్చారు..? : కాంగ్రెస్
- వందేమాతరం బిల్లు లౌకిక స్ఫూర్తికి విరుద్ధం.. డీఎంకే, ఎంఐఎం
Parliament | త్రినేత్ర.న్యూస్ : అయోధ్యలోని రామమందిరంలో విరాళాల చోరీ, నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగం అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. ఆయా అంశాలపై విపక్షాలు పార్లమెంట్‌లో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఇవాళ కూడా ఉభయసభలు దద్దరిల్లాయి. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగాయి. దీంతో ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.
లోక్‌సభలో విరాళాల చోరీపై చర్చకు సమాజ్ వాదీ పార్టీ పట్టుబడుతుండగా.. లాఠీఛార్జ్ అంశంపై అమిత్ షా ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చందా చోరీ ముఖ్యమే అయినప్పటికీ అమిత్ షా అంశాన్ని అర్ధాంతరంగా వదిలివేయలేమని హస్తం పార్టీ వాదిస్తోంది. దీంతో ఇరు పార్టీలూ సభలో ఈ రెండు అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఆయా అంశాలపై ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు పార్లమెంట్ లోపలా, బయట తమ నిరసనను కొనసాగించాయి.
విరాళాల చోరీపై స్కిట్..
విరాళాల చోరీపై ఎంపీలంతా వినూత్నంగా నిరసన తెలిపారు. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఎంపీ పప్పు యాదవ్ (Pappu Yadav) కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి వేశం వేశారు. పార్లమెంట్ ఆవరణలో కూర్చొని విరాళాలు సేకరించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు తమవంతుగా ఆ డబ్బాలో కొంత డబ్బు విరాళంగా వేస్తారు. అనంతరం విరాళాలతో ఆ సన్యాసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అక్కడున్నవారు పట్టుకుని దేహశుద్ధి చేస్తారు. దీంతో స్కిట్ ముగుస్తుంది.
'चढ़ावा चोर - गद्दी छोड़'
राम मंदिर में BJP-RSS ने 'चढ़ावा चोरी' कर देश के करोड़ों रामभक्तों की श्रद्धा से खिलवाड़ किया है- ये महापाप है।
आज संसद परिसर में विपक्ष के सांसदों ने बेहद अनोखे तरीके से 'चढ़ावा चोरी' के खिलाफ विरोध प्रदर्शन किया।
📍 दिल्ली pic.twitter.com/jrCkvYwAGT
— Congress (@INCIndia) July 31, 2026
ఆ ఆదేశాలు ఎవరిచ్చారు..?
మరోవైపు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగింది. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ధర్మేంద్ యాదవ్, మహువా మొయిత్రా, సంజయ్ రౌత్ తదితర ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగానికి ఆదేశాలు ఎవరిచ్చారు..? అంటూ బ్యానర్ ప్రదర్శించారు.
మత స్వేచ్ఛకు విఘాతం
జాతీయ గేయం వందేమాతరానికి చట్టపరమైన రక్షణలు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన వందేమాతరం బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. ముస్లింలు, ఇతర మైనారిటీలను హిందూ దేవతలను ఆరాధించేలా బీజేపీ బలవంతం చేస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగం తన పౌరులందరికీ ఆర్టికల్ 25 కింద కల్పించిన మత స్వేచ్ఛకు ఈ బిల్లు తీవ్ర విఘాతం కలిగిస్తుందని అన్నారు.
లౌకిక స్ఫూర్తికి విరుద్ధం..
అటు డీఎంకే సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు దేశ లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తోందని పేర్కొంది. ఈ పాటలోని కేవలం రెండు పేరాలను మాత్రమే రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని డీఎంకే ఎంపీ రాజా తెలిపారు. రాజ్యాంగ పరిషత్ పరిమితులను దాటడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ బిల్లు న్యాయపరమైన పరిశీలనలో నిలబడదని వాదించారు. ఈ బిల్లు లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని.. దీన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బిల్లును లౌకికవాదానికి వ్యతిరేకమైనదిగా అభివర్ణించింది.
Also Read..
నాదియా...బోల్డ్ అండ్ బ్యూటీపుల్ - కియారా బర్త్‌డే ట్రీట్ అదుర్స్
జేబీఎల్ స్పీకర్లు, పెద్ద డిస్‌ప్లేతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ఫీచర్లు అదుర్స్..
సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్
సంబంధిత వార్తలు

Nishikant Dubey | రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. రాహుల్ చెప్పినదానికంతా తలాడిస్తున్నారు : బీజేపీ ఎంపీ
జులై 31, 2026

Congress | కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. అసెంబ్లీలో మాజీ సీఎంకు సీటు ఎక్కడ?
జులై 31, 2026

Vaddi Raju Ravichandra | రైతులు గంటలకొద్ది లైన్లలో నిలబడుతున్నరు.. యూరియా అందేలా తక్షణం చర్యలు తీసుకోండి
జులై 30, 2026
తాజావార్తలు
- ●Kiara Advani | నాదియా...బోల్డ్ అండ్ బ్యూటీపుల్ - కియారా బర్త్‌డే ట్రీట్ అదుర్స్
- ●Motorola | జేబీఎల్ స్పీకర్లు, పెద్ద డిస్‌ప్లేతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ఫీచర్లు అదుర్స్..
- ●Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్
- ●V Hanumantha Rao | అభిజీత్ దీప్కేను బేదిరించడం మంచిది కాదు.. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తారట
- ●Fake Number Plates | నకిలీ నంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం.. ఆరు క్రిమినల్ కేసులు.. వాహనాలు సీజ్
- ●Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజా ఆలయంలో శిఖర పూజ.. 24 గంటలు ప్రత్యేక నిఘా

Kiara Advani | నాదియా...బోల్డ్ అండ్ బ్యూటీపుల్ - కియారా బర్త్‌డే ట్రీట్ అదుర్స్

Motorola | జేబీఎల్ స్పీకర్లు, పెద్ద డిస్‌ప్లేతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ఫీచర్లు అదుర్స్..

Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్

V Hanumantha Rao | అభిజీత్ దీప్కేను బేదిరించడం మంచిది కాదు.. బీజేపీలో చేరకుంటే అంతుచూస్తారట



