త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల‌కు బిగ్ అలెర్ట్‌.. రేపే ఆర్జిత సేవ‌ల టికెట్ల రిలీజ్‌..!

TTD | నవంబర్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ముందుగానే తేదీలను గమనించి టికెట్లు, టోకెన్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

P

Devotional | Published On Aug 17, 2026, 4.45 pm IST

TTD | తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల‌కు బిగ్ అలెర్ట్‌.. రేపే ఆర్జిత సేవ‌ల టికెట్ల రిలీజ్‌..!
Advertisement

TTD | నవంబర్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ముందుగానే తేదీలను గమనించి టికెట్లు, టోకెన్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్ల కోసం ఎలక్ట్రానిక్‌ డిప్‌లో పాల్గొనేందుకు అదే రోజు నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్‌ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు నిర్ణీత రుసుము చెల్లిస్తే టికెట్లు ఖరారవుతాయి.

21న పలు ఆర్జిత సేవల కోటా

కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను కూడా విడుదల చేయనున్నారు. అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆగస్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

25న ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలని దేవస్థానం సూచించింది.

Advertisement
Advertisement