Allu Arjun | అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ మూవీ లాంఛ్ అప్పుడేనా? – పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈవెంట్!
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ మూవీ రాబోతుంది. నవంబర్‌లో ఈ భారీ బడ్జెట్ సినిమా లాంఛ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ భారీ ఈవెంట్‌తో బన్నీ సినిమాను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Entertainment | Published On Aug 17, 2026, 4.53 pm IST
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో రాకా సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ముంబాయిలో శరవేగంగా సాగుతోంది. రాకాలో దీపికా పడుకోణ్, రష్మిక మందన్న, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వర్కింగ్ టైటిల్....
రాకా సెట్స్‌పై ఉండగానే లోకేష్ కనగరాజ్‌తో ఓ సూపర్ హీరో మూవీకి అల్లు అర్జున్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఓ వీడియోతో స్పెషల్‌గా ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. ఏఏ 23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. హైదరాబాద్‌లోనే బన్నీ సినిమా కోసం స్పెషల్‌గా ఆఫీస్ ఓపెన్ చేసిన లోకేష్ కనగరాజ్ తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు.
నవంబర్‌లో లాంఛ్...
నవంబర్‌లో అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీ గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు సమాచారం. ఓపెనింగ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. పాన్ ఇండియన్ లెవెల్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సెలిబ్రిటీలు అటెండ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏఏ23తోనే లోకేష్ కనగరాజ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
డీసీ రివ్యూ...
కాగా లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాను హైదరాబాద్‌లో స్పెషల్‌గా వీక్షించిన బన్నీ క్లాసిక్ అంటూ రివ్యూ ఇచ్చాడు. "డీసీ మూవీ చూశా. తమిళంలో క్లాసిక్ మూవీ ఇది . ప్రతి మూవీ లవర్ ఖచ్చితంగా చూడాలి. కళను అర్థం చేసుకొని...ప్రేమించే వారికి ఇదొక కవితలా అనిపిస్తుంది" అని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. బన్నీ పోస్ట్ వైరల్ అవుతోంది. డీసీ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంలో వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది. డీసీతోనే లోకేష్ కనగరాజ్ హీరోగా మారాడు.
సంబంధిత వార్తలు

UP Judge | యూపీ జడ్జి సంచలనం.. నాలుగు నెలల్లోనే 22 మందికి మరణశిక్ష
ఆగస్టు 17, 2026

TTD | తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. రేపే ఆర్జిత సేవల టికెట్ల రిలీజ్..!
ఆగస్టు 17, 2026

BJP New National Team | బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●BJP New National Team | బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!
- ●Nirmala Sitharaman | ‘డెవలప్డ్ ఇండియా’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ
- ●Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సందడి - ఇండియా డే పరేడ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ
- ●Harish Rao | సీఎం రేవంత్ ఇల్లే 22A లిస్ట్‌లో.. 30 శాతం కమీషన్ల కోసమే ఈ దందా: హరీశ్ రావు ఫైర్
- ●Stock Markets | మార్కెట్లకు ఐటీ షేర్ల షాక్.. సెన్సెక్స్ 281 పాయింట్లు డౌన్..
- ●CP Sumathi | కాళ్లు, పొట్టకు హషీష్ ఆయిల్ ప్యాకెట్లు కట్టుకున్నారు.. ఎత్తుగడలు వేసి చిక్కిపోయారు

BJP New National Team | బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!

Nirmala Sitharaman | ‘డెవలప్డ్ ఇండియా’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ

Pooja Hegde | న్యూయార్క్‌లో పూజా హెగ్డే సందడి - ఇండియా డే పరేడ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ

Harish Rao | సీఎం రేవంత్ ఇల్లే 22A లిస్ట్‌లో.. 30 శాతం కమీషన్ల కోసమే ఈ దందా: హరీశ్ రావు ఫైర్



