Arunachal Pradesh | చైనా దూకుడుకు భారత్ కౌంటర్.. 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారిక పేర్లు..
Arunachal Pradesh | అరుణాచల్‌ప్రదేశ్‌పై హక్కు కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ మరోసారి గట్టి సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలోని 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారికంగా పేర్లు ఖరారు చేసింది. ఈ పేర్లను సర్వే ఆఫ్ ఇండియా రూపొందించే అధికారిక మ్యాపుల్లో చేర్చనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Arunachal Pradesh | అరుణాచల్‌ప్రదేశ్‌పై హక్కు కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ మరోసారి గట్టి సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలోని 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారికంగా పేర్లు ఖరారు చేసింది. ఈ పేర్లను సర్వే ఆఫ్ ఇండియా రూపొందించే అధికారిక మ్యాపుల్లో చేర్చనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా పేర్లు ఖరారైన ప్రాంతాల్లో అప్పర్ సుబన్‌సిరి జిల్లాకు చెందిన లాంగ్జూ, మాజా, బిసా వంటి సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. నాలుగు కీలక పర్వత కనుమలు జో లా, రిజా లా, పుకుర్ లా, థాగ్ లాలకు కూడా అధికారిక గుర్తింపు ఇచ్చారు. వీటితో పాటు ఎత్తైన సంభో సరోవర్ సరస్సు, షేర్-ఎ-థాపా స్మారక చిహ్నం కూడా జాబితాలో ఉన్నాయి. అంజావ్, చాంగ్‌లాంగ్, వెస్ట్ కామెంగ్, లోహిత్, తవాంగ్ జిల్లాల్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలకు సైతం పేర్లు ఖరారు చేసినట్లు కేంద్రం తెలిపింది. సరిహద్దు ప్రాంతాల భౌగోళిక గుర్తింపు మరింత స్పష్టంగా ఉండేలా ఈ చర్య చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
చైనాకు ధీటుగా..
అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా తరచూ కొత్త పేర్లు ప్రకటిస్తూ వస్తోంది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంపై తనకు హక్కు ఉందన్న భావనను కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన కేంద్రం.. సరిహద్దు ప్రాంతాలపై అధికారిక రికార్డులను మరింత బలోపేతం చేసే దిశగా అడుగు వేసింది. కొత్తగా పేర్లు ఖరారైన ప్రాంతాల్లో అనేకం ఇప్పటికే భారత సైనిక మ్యాపుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు వాటిని సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాపుల్లోనూ చేర్చడం ద్వారా దేశ భూభాగానికి సంబంధించిన రికార్డుల్లో మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తాజా జాబితాలో భారత్-చైనా సరిహద్దు వివాదంతో ముడిపడిన చారిత్రక ప్రదేశాలు ఉండటం కూడా ప్రత్యేకత సంతరించుకుంది. 1959లో చోటుచేసుకున్న లాంగ్జూ ఘటనతోపాటు 1962 భారత్-చైనా యుద్ధానికి సంబంధించిన ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడం వల్ల భౌగోళిక వాస్తవాలు మారబోవని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. పేర్ల మార్పిడితో రాష్ట్రంపై భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పింది. తాజాగా 27 ప్రాంతాలకు అధికారిక పేర్లు ఖరారు చేయడం ద్వారా ఈ విషయంలో భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Drugs | హైదరాబాద్‌లో రూ.12.65 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్
- ●Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు
- ●Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!
- ●Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
- ●Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..
- ●Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాలకు విజయ్ దేవరకొండ.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు

Drugs | హైదరాబాద్‌లో రూ.12.65 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు

Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!

Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు





