CJP | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. అప్పుడే కేంద్రంతో చర్చలు: సీజేపీ
CJP | నీట్ ప్రశ్నపత్రం లీక్ (NEET Paper Leak), విద్యా వ్యవస్థలో మార్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీకి (CJP) మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇరుపక్షాల మధ్య ఇప్పటికే రెండు పర్యాయాలు చర్చలు జరిగిన విషయం తెలిసిందే.
CJP | త్రినేత్ర.న్యూస్: నీట్ ప్రశ్నపత్రం లీక్ (NEET Paper Leak), విద్యా వ్యవస్థలో మార్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీకి (CJP) మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇరుపక్షాల మధ్య ఇప్పటికే రెండు పర్యాయాలు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. సీజేపీ డిమాండ్లలో పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా (Resignation) విషయంలో మాత్రం దాటవేత ధోరణి కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యతవహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబడుతున్నది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే చర్చలు కొనసాగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చర్చలకు అతీతమైన అంశం (NON-NEGOTIABLE), ప్రభుత్వం ఆయన రాజీనామాకు అంగీకరించకపోతే తదుపరి చర్చలకు అర్ధం ఉండదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా (Ashutosh Ranka) ఎక్స్ వేదికగా వెళ్లడించారు. విద్యామంత్రి (Education Minister) రాజీనామా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కాగా, ఇరుపక్షాల మధ్య మరికాసేపట్లో మూడో విడత చర్చలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీజేపీ చేసిన ప్రకటనతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Dharmendra Pradhan’s resignation is NON-NEGOTIABLE.
If it’s a no from the government, there’s no point of further discussion.
— Ashutosh Ranka (@AshutoshRanka) July 25, 2026
కాగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం, సీజీపీ మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయమై తమకు 24 గంటల సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతామంటూ వాయిదా వేసింది. విద్యామంత్రి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రధాన్ రాజీనామా విషయం తేల్చకుండా మరోసారి కేంద్రంతో చర్చలు జరిపేది లేదని సీజేపీ స్పష్టం చేసింది.
ప్రధాన్ రాజీనామానే ప్రధానం కాదు: సోనమ్ వాంగ్‌చుక్
మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కచ్చితంగా ప్రధాన విషయమే, అయితే నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే తనకు ప్రాధాన్య అంశంగా అనిపించిందని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయకుండానే దీక్ష విరమించడంపై ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. కేంద్రంలో చర్చల సమయంలో ప్రధాన్ రాజీనామా గురించి తాను డిమాండ్ చేయాలదని, దానిని వ్యక్తిగతంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందనుకోవడం లేదని చెప్పారు. దీనిని కేంద్ర పెద్ద విషయంగా భావించడం లేదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Sobhita Dhulipala | భార్య వంటపై నాగచైతన్య ఫన్నీ ఫోస్ట్ - శోభిత క్యూట్ రిప్లై
- ●Pandharpur Wari 2026 | ఆషాఢ ఏకాదశి 2026: పండరీపురంలో భక్తజన సంద్రం.. పూజా సమయాలు, కంప్లీట్ ట్రావెల్ గైడ్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
- ●NMDC Recruitment | ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..
- ●Maruti Suzuki | కొత్త బ్రెజ్జా వచ్చేసింది.. టర్బో ఇంజిన్‌తో మారుతి భారీ అప్డేట్..
- ●WhatsApp | వాట్సాప్ అప్డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..

Sobhita Dhulipala | భార్య వంటపై నాగచైతన్య ఫన్నీ ఫోస్ట్ - శోభిత క్యూట్ రిప్లై

Pandharpur Wari 2026 | ఆషాఢ ఏకాదశి 2026: పండరీపురంలో భక్తజన సంద్రం.. పూజా సమయాలు, కంప్లీట్ ట్రావెల్ గైడ్

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..

NMDC Recruitment | ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..






