త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devireddy Sudheer Reddy | రాష్ట్రాన్ని ఎండ‌వెట్టిన దుర్మార్గునివి నువ్‌.. క‌రువు తెచ్చిన ప్ర‌థ‌మ ముద్దాయివి

Devireddy Sudheer Reddy | హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రానికి తాగునీటి (Drinking water) క‌ష్టాలొస్తే ప్ర‌ధాన కార‌కుడు రేవంతే అవుతాడ‌ని.. ఇదే ఖైర‌తాబాద్ చౌర‌స్తాలో ప్ర‌జ‌లు ఆయ‌న ప్యాంట్ ఇప్పి ఈత బ‌రిగెల వాత‌లు పెట్ట‌డం ఖాయ‌మ‌ని ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి (Devireddy Sudheer Reddy) హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Nov 9, 2026, 1.14 pm IST

Devireddy Sudheer Reddy | రాష్ట్రాన్ని ఎండ‌వెట్టిన దుర్మార్గునివి నువ్‌.. క‌రువు తెచ్చిన ప్ర‌థ‌మ ముద్దాయివి
Advertisement
  • హైద‌రాబాద్‌కు తాగునీటి క‌ష్టాలోస్తే నీ ప్యాంట్ ఇప్పి వాత‌లు పెడ్త‌రు
  • దానికి ఖైర‌తాబాదే వేదికైత‌ది
  • బిడ్డా.. నీ లాంగ్వేజ్ మార్సుకో
  • రేవంత్‌కు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వార్నింగ్

Devireddy Sudheer Reddy | త్రినేత్ర న్యూస్: హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రానికి తాగునీటి (Drinking water) క‌ష్టాలొస్తే ప్ర‌ధాన కార‌కుడు రేవంతే అవుతాడ‌ని.. ఇదే ఖైర‌తాబాద్ చౌర‌స్తాలో ప్ర‌జ‌లు ఆయ‌న ప్యాంట్ ఇప్పి ఈత బ‌రిగెల వాత‌లు పెట్ట‌డం ఖాయ‌మ‌ని ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి (Devireddy Sudheer Reddy) హెచ్చ‌రించారు. రేవంత్ లాంగ్వేజ్ మార్సుకోకుంటే ప్ర‌జ‌లే త‌గిన బుద్ధి చెప్తార‌న్నారు. మేడిగ‌డ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయ‌కుండా రాష్ట్రాన్ని ఎండ‌బెట్టిన దుర్మార్గుడని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ రేవంత్‌పై విరుచుకుప‌డ్డారు.

మేడిగ‌డ్డ ద‌గ్గ‌ర దాదాపు రెండు టీఎంసీల నీళ్లు పోతున్న‌య్. ఎత్తిపోసుకునే అవ‌కాశం ఉంది. మేడిగ‌డ్డ నుంచి క‌న్నెప‌ల్లి దాదాపు 8 కిలోమీట‌ర్ల దూరం ఉంది. మేడిగ‌డ్డ కొంచెం క్రాక్ అయింది.. కానీ అన్నారం, సుందిళ్ల బాగున్న‌య‌ని గ‌తంలో ఎన్‌డీఎస్ఏ కూడా స‌ర్టిఫికెట్ ఇచ్చింది. సీడ‌బ్ల్యూపీఆర్ఎస్‌ అనే కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ కూడా ఇవాళ క్లీన్‌చిట్ ఇచ్చింది. టెక్నిక‌ల్‌గా మేం కోర్టుకు రిపోర్టు ఇయ్య‌గ‌లుగుతం.. ఎత్తిపోసుకునేది మీర‌ని ఎన్‌డీఎస్ఏ కూడా స్ప‌ష్టంగా చెప్పింది.

10 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీళ్లు..

ఈ సంవ‌త్స‌రం ఆగ‌స్టు 1న 10 లక్ష‌ల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోయి స‌ముద్రంలో క‌లిసిన‌య్‌. ఇన్ని నీళ్ల‌ను తట్టుకునే శ‌క్తి ఉన్న‌ప్పుడు క్రాక్‌ను ఒక కార‌ణంగా చూపెట్టి ఇవాళ నీళ్లు ఎత్తిపోయ‌కుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఎండ‌బెట్టిన‌వ్‌? ఇవాళ వ్య‌వ‌సాయానికి సాగు నీరు, ప్ర‌జ‌ల‌కు తాగు నీరు లేకుండ చేసిన దుర్మార్గునివి నువ్‌. ఎవ‌రైనా స‌రే పెద్ద ప‌ద‌విలో కూసున్న‌ప్పుడు విశాల దృక్ప‌థంతో ఉండాలే. గ‌త విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకొని పంతాలకు పోవ‌ద్దు. ప్ర‌జ‌ల‌కు ఏం వాగ్దానం చేసినం.. ఏం చేయ‌గ‌లుగుతం అనేది నిరంత‌రం ఆలోచించాలి.

క‌క్ష సాధింపు చ‌ర్య‌లు ఎందుకు ప‌నికి రావు. క‌న్నెప‌ల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తే కేసీఆర్‌కు మంచి పేరు వ‌స్త‌ది.. నేనే అబ‌ద్దం చెప్పి మ‌ళ్ల నీళ్లు ఎత్తిపోస్తే నా మొఖం ఏడ వెట్టుకోవాలే.. ప్ర‌జ‌లు న‌న్ను న‌మ్మ‌రు అని ఒక దురుద్దేశం పెట్టుకున్న‌వ్‌. తెలంగాణ రాష్ట్రానికి క‌రువు తీసుకొచ్చిన ప్ర‌థ‌మ ముద్దాయి నువ్వే.

రిటైర్డ్ ఇంజినీర్లు స‌ల‌హాలు ఇస్తే వాళ్ల‌కు బెల్ట్ ట్రీట్‌మెంట్ కావాలంట‌డు. మ‌మ్మ‌ల్నేమో బ‌ర్రెలు కాసుకుంట‌డు ఇసుక‌ల పాతిపెడ‌తం అంట‌డు. బిడ్డ నువ్ ఇట్ల‌నే లాంగ్వేజ్ వాడితే.. హైదరాబాద్ నగరానికి తాగునీటి క‌ష్టాలు వ‌స్తే దానికి ప్ర‌ధాన కార‌ణం నువ్వే అయిత‌వ్. ఇదే ఖైరతాబాద్ చౌరస్తాలో ప్రజలు నీ ప్యాంట్ ఇప్పి ఈత బ‌రిగెల‌తోటి నీ పిర్ర‌ల మీద కొట్ట‌కుంటే సూడు ఇగ‌. నీళ్లు ఎత్తిపోయమంటే మమ్మల్ని తిట్టడం కాదు నీటి కొరతకు కారణమైన రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారు.

జైపాల్‌రెడ్డి మీద లేని ప్రేమ‌ను ఒల‌క‌వోస్తున్న‌డు

జైపాల్‌రెడ్డి పేరు మీద ఒక జిల్లా, ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయాల‌ని లేని ప్రేమంతా ఒల‌క‌బోస్తుండు. జైపాల్‌రెడ్డి అంటే రేవంత్ ప‌డ‌దు. ఇది ఇంట‌ర్న‌ల్‌గా ఉన్నోళ్ల‌కు అంద‌రికి తెల్సు అని సుధీర్‌రెడ్డి విమ‌ర్శించారు.

బ‌ర్రెలు కాసేవాడ‌న్నా బాధ‌ప‌డా

ముఖ్యమంత్రి మాట్లాడుతూ కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకి పోయిన వాళ్లను తీవ్రమైన పదజాలంతో మాట్లాడాడు. బర్రెలు కాసేవారు చిన్నవారు కాదు.. వాళ్ళు పైసా పైసా కూడబెట్టి మంచి ఉన్నతమైన స్థానంకు ఎదిగారు. నన్ను బర్రెలు కాసేవారు అంటే నేను బాధపడను. నువ్‌ మాత్రం ఎలాంటి కష్టం లేకుండా భూమిపై కన్నువేసి అక్రమంగా సంపాదించినవు.

93.5 దగ్గర నీటి ప్రవాహం ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి పంపు హౌస్ కు వెళ్ళడం జరిగింది అక్కడకు వెళ్తే మమ్ములను లోపలికి రాకుండా పొలీస్ లు అడ్డుకున్నరు. అక్కడ లోపలికి పోకుండా అడ్డుకోవడంతో మాకు అనుమానం వచ్చింది. ఎందుకుంటే మేడిగడ్డ దగ్గర శబ్దం వచ్చింది.. అందుకే ఇక్కడ కూడా కన్నెపల్లి దగ్గర లోపలికి రానివ్వలేదు. దేవాదుల ప్రాజెక్టు దగ్గర బరాజ్ లేదు మోటర్లతోనే పంపింగ్ చేస్తున్నారు. సీతారామ దగ్గర కూడా బ‌రాజ్ లేదు. ప‌ట్టిసీమ దగ్గర కూడా బరాజ్ లేదు. కానీ నీటి పంపింగ్ అవుతుంది.

బ్యారేజ్ ఎప్పుడూ అవసరం నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎండాకాలంలో అవ‌సరం అవుతుంది. తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు అని అనేక సందర్భాల్లో నిరూపితం అయింది. మేం పోయి నిలదీసిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేసి ఒక్క రోజు రెండు రోజు నడిపించి ఆఫ్ చేశారు. 80 నుండి 120 రోజుల పాటు నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం మనకు ఉన్నది.

నీ త‌మ్ముడికి క‌లెక్ట‌ర్ సైతం సెల్యూట్ చేస్త‌డు

కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా తమాషా చేస్తోంది. రాష్ట్రంలో రైతులు సాగుకు, తాగుకు నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు. దద్దమ్మ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్లు? నీ తమ్ముడు 9 తరగతి చదివి ఇప్పుడ స్వచ్ బయోకు చైర్మన్ అవుతాడు. అల్లుడికి మెడికవర్ హాస్పిటల్.. ఇంకో తమ్ముడు కు ఇంకో కంపెనీ. నీ మనవడికి ఫుట్ బాల్ ఇస్తామని మెస్సీని ఇక్కడకు ర‌ప్పిస్తివి. నీ అన్న తిరుపతి రెడ్డి ఏం పదవి లేకున్న కొడంగల్ లో కలెక్టర్ సైతం సెల్యూట్ చేస్తాడు. కేసీఆర్ పెట్టిన ఎస్టీపీల ద్వారా గ్రీన్ వాటర్ సప్లై చేస్తున్నారు. అది కేసీఆర్ ఘనతనే. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తాం అంటున్నావ్ నీతో సాధ్యం కాదు.

దేశంలో అనేక రాష్ట్రంలో డ్యామ్‌లు కొట్టుకుపోయినా అక్కడకు ఎన్డీఎస్ఏ పోదు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వదు. ముందస్తు ప్రణాళికలు లేకుండా ఉంటే నష్టం వస్తుంది అని ముందే ప్లాన్ చేశాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను కూడా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ ఆలోచన చేశారు. నిండు సభలో రెవెన్యూ మంత్రి పచ్చి అబద్ధాలను మాట్లాడాడు. టిమ్స్ హాస్పిటల్ నిర్మించడానికి వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేను రిక్వెస్ట్ చేశాను. ఒక్క రిజర్వాయర్ కావాలి.. పార్క్ కావాలి.. పోలీస్ స్టేషన్ కావాలి అని అడిగాను. వెంటనే జీవో ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక జీవో రద్దు చేశారు అని సుధీర్‌రెడ్డి విమ‌ర్శించారు.

Advertisement
Advertisement