త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం ప‌ద‌వి నుంచి దించుతా : కేఏ పాల్

KA Paul | రేవంత్‌ రెడ్డిని నమ్మి మోసపోయా.. సీఎం పదవి నుంచి దించుతాన‌ని ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ హెచ్చ‌రించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నార‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Nov 9, 2026, 1.27 pm IST

KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం ప‌ద‌వి నుంచి దించుతా : కేఏ పాల్
Advertisement

KA Paul | త్రినేత్ర న్యూస్ : రేవంత్‌ రెడ్డిని నమ్మి మోసపోయా.. సీఎం పదవి నుంచి దించుతాన‌ని ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ హెచ్చ‌రించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నార‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. ఈ మేర‌కు కేఏ పాల్ ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురించి ఇలాంటి వీడియోలు చేస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. కార‌ణం ఏంటంటే రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అయిపోయింది. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయి మూడేండ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఏ వాగ్దానాన్ని నెర‌వేర్చ‌లేదు. రేవంత్ సీఎం అయ్యాక మూడు ల‌క్ష‌ల కోట్ల అప్పు పేరుకుపోయింది. ఏడుగురు అన్నదమ్ములు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారు. ఇప్పటికే లక్ష కోట్లు దోచుకున్నారు. రేవంత్ సీఎం కావాల‌ని కోరుకున్నాను. ఆయ‌న‌కు టైమ్ ఇవ్వండ‌ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్, జగ్గారెడ్డికి వార్నింగ్ ఇచ్చాను. ఇప్పటికైనా రేవంత్ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. లేదంటే ముఖ్యమంత్రి పదవి నుంచి గద్దె దించుతాన‌ని కేఏ పాల్ హెచ్చరించారు.

Advertisement
Advertisement