త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోరు.. లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగిన పెట్టుబ‌డిదారులు..

Gold And Silver Prices Today | ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొంటుండ‌గా, బులియ‌న్ మార్కెట్ల‌లో ప‌రిస్థితి భిన్నంగా ఉంది. గ‌త వారం రోజులుగా తీవ్ర హెచ్చుత‌గ్గుల‌ను ఎదుర్కొంటున్న బంగారం, వెండి ధ‌ర‌లు ఈ వారం పాజిటివ్‌గా మారాయి. సేఫ్ హావెన్ ఆస్తుల ప‌ట్ల పెట్టుబ‌డిదారులు మొగ్గుచూపుతుండ‌డంతో ఆయా లోహాల ధ‌ర‌లు పెరుగుతున్నాయి.

S

Business | Published On Oct 28, 2026, 11.12 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోరు.. లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగిన పెట్టుబ‌డిదారులు..
Advertisement

Gold And Silver Prices Today | ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొంటుండ‌గా, బులియ‌న్ మార్కెట్ల‌లో ప‌రిస్థితి భిన్నంగా ఉంది. గ‌త వారం రోజులుగా తీవ్ర హెచ్చుత‌గ్గుల‌ను ఎదుర్కొంటున్న బంగారం, వెండి ధ‌ర‌లు ఈ వారం పాజిటివ్‌గా మారాయి. సేఫ్ హావెన్ ఆస్తుల ప‌ట్ల పెట్టుబ‌డిదారులు మొగ్గుచూపుతుండ‌డంతో ఆయా లోహాల ధ‌ర‌లు పెరుగుతున్నాయి. అయితే గ‌త సెష‌న్‌లో వ‌చ్చిన భారీ ర్యాలీ అనంతరం పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపారు. దీంతో బంగారం, వెండి ధ‌ర‌లు ఈ సెష‌న్‌లో కాస్త త‌గ్గాయి. కానీ దేశీయంగా మాత్రం ధ‌ర‌లు పెరిగాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర బుధ‌వారం 0.63 శాతం త‌గ్గి 4,035 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.87 శాతం త‌గ్గి 53 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 522 పాయింట్లు త‌గ్గి 1,43,616 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1484 పాయింట్లు త‌గ్గి 1,95,233 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఒక మోస్త‌రుగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,395 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,15,160 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,43,950 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,39,500 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6,600 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,195 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,05,560గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,31,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,19,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,796 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.86,368గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,07,960 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,79,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,900 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,20,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,200గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,20,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,200 గా ఉంది.

Advertisement
Advertisement