Maharashtra | రైతులకు “మహా” సర్కారు ఊరట
Maharashtra | కరువు పరిస్థితులతో పంట నష్టాలను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని 304 తాలూకాల్లో సుమారు కోటిన్నర మంది రైతులకు దీపావళికి ముందే రూ.5వేల చొప్పున ముందస్తు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
- రూ.5వేల చొప్పున ఆర్థికసాయం
- దీపావళికి ముందు అన్నదాతలకు కరువు సాయం
- డీబీటీ ద్వారా ఖాతాల్లో జమ
Maharashtra | కరువు పరిస్థితులతో పంట నష్టాలను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని 304 తాలూకాల్లో సుమారు కోటిన్నర మంది రైతులకు దీపావళికి ముందే రూ.5వేల చొప్పున ముందస్తు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరువు ప్రభావంతో నష్టపోయిన రైతులకు తక్షణ ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా ఈ ముందస్తు సాయం ప్రకటించారు. 33 శాతానికి పైగా పంట నష్టం జరిగిన రైతులకు రూ.5వేల మొత్తాన్ని పూర్తిగా అందించనున్నారు. ఈ నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానంలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
రూ.40 వేల కోట్ల సాయం కోసం..
రాష్ట్రంలో పంట నష్టాల అంచనాకు సంబంధించి ఇప్పటివరకు 97 శాతం పంచనామాలు పూర్తయ్యాయి. రైతులకు మరింత ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.40 వేలకోట్ల ఆర్థిక సాయం కోరుతూ ప్రతిపాదన పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరువు పరిస్థితుల్లో రైతులకు తక్షణ ఊరట కల్పించడంతోపాటు, అదనపు సహాయం కోసం కేంద్రాన్ని ఆశ్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మంత్రివర్గ సమావేశంలో ఇతర నిర్ణయాలు
వికసిత్ భారత్–జీ రామ్ జీ పథకంతో పాటు ఇతర పథకాల సమన్వయంతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. జిల్లా ప్రణాళికా కమిటీ నిధులతో రాష్ట్రస్థాయి పథకాన్ని అమలు చేసేందుకు, జిల్లా స్థాయి పథకంగా కూడా ఆమోదం తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి కమిటీకి అధికారాలు కల్పించారు. జిల్లా వార్షిక ప్రణాళిక (జనరల్) నిధుల్లో ఒక శాతాన్ని దివ్యాంగుల సంక్షేమం, పునరావాసం, సాధికారత కోసం వినియోగించేందుకు అంగీకరించారు. జలవనరుల శాఖలో పోస్టుల పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పుణె మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ప్రణాళికలో లోహేగావ్ స్పోర్ట్స్ స్పేస్ రిజర్వేషన్‌ను మార్చి, న్యూఢిల్లీలోని భారత్ మండపం తరహాలో జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
ఈవీ పాలసీకి ఆర్థిక సాయం..
మహారాష్ట్ర ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోషన్ పాలసీ కింద ఈవీల తయారీ కోసం బజాజ్ ఆటో లిమిటెడ్‌కు రూ.66.82 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని చిపి విమానాశ్రయానికి విమాన సేవలను పునరుద్ధరించేందుకు నవీ ముంబయి–చిపి (సింధుదుర్గ్), చిపి–నవీ ముంబై మార్గాల్లో విమానయాన సంస్థలకు 100 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించేందుకు ఆమోదంతెలిపారు. లాతూర్ జిల్లాలోని అహ్మద్‌పూర్ తాలూకా శిరూర్ తాజ్‌బంద్‌లో ఉన్న మల్హర్‌రావు హోల్కర్ నోమాడిక్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లుకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపారు. పీపీపీ విధానంలో మార్పులు చేయడంతో పాటు జిల్లా పరిషత్‌లలో పోస్టుల విలీనం, ఎంఐడీసీ విస్తరణకు భూమి కేటాయింపు, 2014 నాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం లభించింది. దాంతో వైస్ ఛాన్సెలర్‌ను పదవి నుంచి తొలగించే అధికారం ఛాన్సెలర్‌కు కల్పించనున్నారు.
తాజావార్తలు
- ●Jeevan Reddy | రేవంత్! నాన్చకు ఇగ.. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపొయ్
- ●PhonePe | ఫోన్‌పేలో రూ.250తో ఎన్పీఎస్ ఖాతా.. కేవైసీ అవసరం లేదు..
- ●Shah Rukh Khan | హంతకుడా...ప్రేమికుడా..? - కింగ్ పోస్ట్‌పోన్ రూమర్లపై స్టైలిష్ పోస్టర్‌తో షారుఖ్ క్లారిటీ
- ●Asha Workers | డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్త సమ్మె
- ●Agriculture Dept | వరి విత్తనాల విక్రయానికి సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి కాదు
- ●E20 fuel | పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని 20%కి మించి పెంచే ఆలోచన లేదు : కేంద్ర మంత్రి

Jeevan Reddy | రేవంత్! నాన్చకు ఇగ.. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపొయ్

PhonePe | ఫోన్‌పేలో రూ.250తో ఎన్పీఎస్ ఖాతా.. కేవైసీ అవసరం లేదు..

Shah Rukh Khan | హంతకుడా...ప్రేమికుడా..? - కింగ్ పోస్ట్‌పోన్ రూమర్లపై స్టైలిష్ పోస్టర్‌తో షారుఖ్ క్లారిటీ

Asha Workers | డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్త సమ్మె






