త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Renu Desai | ల‌వ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ – డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్

యాక్ట‌ర్‌గా రేణుదేశాయ్ రీఎంట్రీ ఇస్తోంది. కాశీ మ‌జిలీ పేరుతో ఓ మినీ మూవీ చేసింది. హీరోయిన్‌గా న‌టిస్తూనే ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా రేణుదేశాయ్ అందించింది. కాశీ మిజిలీ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో సెప్టెంబ‌ర్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Sep 12, 2026, 12.15 pm IST

Renu Desai | ల‌వ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ – డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్
Advertisement

Renu Desai |  ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తోంది. యాక్ట‌ర్‌గా రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. హీరోయిన్‌గా న‌టిస్తూనే ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా రేణుదేశాయ్ అందించారు.కానీ ఈ సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.

కాశీ మ‌జిలీ

రేణుదేశాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో కాశీ మ‌జిలీ పేరుతో ఓ మినీ మూవీ తెర‌కెక్కింది. సెప్టెంబ‌ర్ 13 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మినీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. కాశీ మ‌జిలీ ట్రైల‌ర్‌ను ఈటీవీ విన్ శ‌నివారం రిలీజ్ చేసింది. కాశీ వ‌చ్చిన ఓ మ‌హిళ త‌న బ్యాగ్ పొగొట్టుకుంటుంది. ఆమెకు ఓ ఫొటోగ్రాఫ‌ర్ ప‌రిచ‌యం అవుతాడు. ఇద్ద‌రు క‌లిసి సాగించిన జ‌ర్నీ, ఈ క్ర‌మంలో ఒక‌రితో మ‌రొక‌రు ప్రేమ‌లో ప‌డ‌టం లాంటి అంశాల‌ చుట్టూ ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు. కాశీ విజువ‌ల్స్‌, మెలోడీ ప్ర‌ధానంగా సాగే మ్యూజిక్ ఆక‌ట్టుకుంటున్నాయి.

క‌థ‌, స్క్రీన్‌ప్లే...

కాశీ మ‌జిలీ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రేణుదేశాయ్ స‌మ‌కూర్చారు. య‌మునా కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అబ్బూరి ర‌వి డైలాగ్స్ ప‌ర్య‌వేక్ష‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. జోశ్య‌భ‌ట్ల మ్యూజిక్ అందించారు. మూడేళ్ల త‌ర్వాత రేణుదేశాయ్ న‌టిస్తోన్న సినిమా కావ‌డం, ఆమెను క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తుండ‌టంతో కాశీ మ‌జిలీ టాలీవుడ్ ఫ్యాన్స్‌లో ఆస‌క్తి నెల‌కొంది.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు...

చివ‌ర‌గా తెలుగులో ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావులో ఓ కీల‌క పాత్ర‌లో రేణుదేశాయ్ క‌నిపించింది. ఆ త‌ర్వాత అవ‌కాశాలు వ‌చ్చినా సినిమాలు చేయ‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ద్రి సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో జానీ మూవీ వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప్రేమ‌లో ప‌డిన రేణుదేశాయ్ అత‌డిని పెళ్లిచేసుకుంది. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా మూడేళ్ల‌కే విడిపోయారు. ఈ జంట‌కు అకీరా నంద‌న్‌, ఆద్య అనే పిల్ల‌లు ఉన్నారు.

 

 

Advertisement
Advertisement