Ramachander Rao | మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు..
Ramachander Rao | ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వెల్లడించారు.
నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్
సెప్టెంబర్ 17న సాయంత్రం ప్రారంభం
మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్తాం
మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమాలను సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించి మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన మోదీ ప్రయాణం, నేడు దేశానికి ‘ప్రధాన సేవక్’గా నిలిచే స్థాయికి చేరుకుంది. దార్శనికత స్పష్టంగా ఉండి, సంకల్పం దృఢంగా ఉంటే దేశంలోని సామాన్య ప్రజల జీవితాల్లో ఎంతటి సానుకూల, పరివర్తనాత్మక మార్పు తీసుకురాగలమో మోదీ ప్రస్థానం నిరూపించింది. ఈ అభియాన్‌లో భాగంగా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘మేరే సప్నో కా భారత్ – చిత్ర సేవ’, ‘నమో సేవ’, ‘అంగన్ మిలన్ సేవ’ వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా సేవా ప్రస్థానాన్ని ప్రారంభించారు. సీఎంగా 12.5 ఏళ్లు, ప్రధానిగా అక్టోబర్ 7 నాటికి 12.5 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. అక్టోబర్ 7 నాటికి ఆయన ప్రజా సేవా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తి కానున్నాయని పేర్కొన్నారు.
25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ఆయన నాయకత్వం, దూరదృష్టికి నిదర్శనం. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడం, 100 కోట్లకు పైగా ప్రజలను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడం, 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.. ఇవన్నీ ఆయన నిరంతర కృషి ఫలితాలే అని రామచందర్ రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?
- ●Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
- ●Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి
- ●Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి - వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు షాక్.. 3 నెలల కనిష్ఠానికి నిఫ్టీ..
- ●Vakiti Srihari | బీసీలకు రిజర్వేషన్లు దానం కాదు.. అది మా హక్కు

UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?

Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు

Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి

Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి - వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ






