త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adi Srinivas | ప‌దేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీర‌ప్ప‌న్‌ను మించిన ఘ‌నులు బీఆర్ఎస్ నేత‌లు: ఆది శ్రీనివాస్‌

Adi Srinivas | ప‌దేండ్ల‌పాటు రాష్ట్రాన్ని య‌థేచ్చ‌గా దోచుకుని దాచుకున్న బీఆర్ఎస్ (BRS) నేత‌లు వీర‌ప్ప‌న్ (Veerappan) కంటే మించిన ఘ‌నుల‌ని ప్ర‌భుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమ‌ర్శించారు. ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని (Revanth Reddy) వీరప్పన్‌తో పోల్చడం సిగ్గుచేటన్నారు.

G

Telangana | Published On Sep 12, 2026, 12.09 pm IST

Adi Srinivas | ప‌దేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీర‌ప్ప‌న్‌ను మించిన ఘ‌నులు బీఆర్ఎస్ నేత‌లు: ఆది శ్రీనివాస్‌
Advertisement

Adi Srinivas | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌దేండ్ల‌పాటు రాష్ట్రాన్ని య‌థేచ్చ‌గా దోచుకుని దాచుకున్న బీఆర్ఎస్ (BRS) నేత‌లు వీర‌ప్ప‌న్ (Veerappan) కంటే మించిన ఘ‌నుల‌ని ప్ర‌భుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమ‌ర్శించారు. ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని (Revanth Reddy) వీరప్పన్‌తో పోల్చడం సిగ్గుచేటన్నారు. అధికారంలో లేమనే తీవ్ర అసహనం, ఫ్రస్ట్రేషన్‌లో కేటీఆర్ (KTR), హరీశ్ రావులు (Harish Rao) ప్రభుత్వంపై పిచ్చి ప్రలాపనలు చేస్తూ అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు అద్దంకి దయాక‌ర్‌, బ‌ల్మూర్ వెంక‌ట్‌తో క‌లిసి ఆయన మాట్లాడారు. సెక్షన్ 22A నిషేధిత భూముల (Section 22A) జాబితాపై బీఆర్ఎస్‌ పార్టీ కల్పిత ప్రచారాలు చేస్తున్న‌దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయే భూములు ఆ జాబితాలో ఎందుకు ఉన్నాయో అసెంబ్లీలో వివరిస్తామని తెలిపారు. దశాబ్దాలుగా ఉన్న‌ ప్రజా ఆస్తులు, కోర్టు వివాదాలు ఉన్న స్థలాలు మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయని, భూ భారతి ద్వారా సాంకేతిక సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు.

బీజేపీ (BJP) బీసీ వ్యతిరేక విధానాలను అవ‌లంభిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను (BC Reservation Bill) 42 శాతానికి పెంచాల‌ని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన బిల్లును కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించకపోవడం దారుణమని ధ్వ‌జ‌మెత్తారు. జ‌నాభా లెక్క‌ల్లో (Scenes) బీసీ కుల గణన కాలమ్‌ను వెంటనే చేర్చాలని డిమాండ్ చేశారు. సభ బయట బీసీలకు అనుకూలమని చెప్పే బీజేపీ నేతలు, సభ లోపల మాత్రం వారి ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోరని విమర్శించారు. శాసనసభలో బీసీ సమస్యలపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి పారిపోయారని, త‌ద్వారా త‌మ‌ వ్యతిరేక వైఖరిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకున్నార‌ని చెప్పారు.

బ‌డి దొంగ‌లు..

బీఆర్ఎస్ నేత‌లు కుంభకర్ణుడి వారసుల‌ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. 22ఏ భూముల అంశంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ‘మీ బినామీలు లక్షల కోట్లతో ఉన్నారు.. వారి వివరాలు కూడా బయటకు వస్తాయి` అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గ‌త‌ మూడేండ్లుగా పడుకున్నార‌ని, ఎప్పుడు లేస్తారో తెలియదంటూ ఎద్దేవా చేశారు. నిషేధిత జాబితా ద్వారా 20 వేల ఎకరాలు కొల్లగొట్టార‌ని, అందుకే అసెంబ్లీలో చర్చకు భయపడుతున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావులు 'బడి దొంగల' లాగా సమావేశాలకు రాకుండా బయటే కాలక్షేపం చేస్తున్నారని మండిప‌డ్డారు.

Advertisement
Advertisement