CM Vijay | అసెంబ్లీలో ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. ఎందుకంటే..?
CM Vijay | తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష డీఎంకేకి సభ సాక్షిగా ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) క్షమాపణలు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధి (former CM M Karunanidhi)ని ఓ మంత్రి కేవలం పేరుతో పిలవడంపై డీఎంకే నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం సారీ చెప్పాల్సి వచ్చింది.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు అసెంబ్లీలో (Tamil Nadu Assembly) అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధి (former CM M Karunanidhi)ని 'కలైంజర్' లేదా 'మాజీ ముఖ్యమంత్రి' అని కాకుండా ఓ మంత్రి కేవలం పేరుతో పిలవడం వివాదానికి దారితీసింది. దీనిపై ప్రతిపక్ష డీఎంకే తీవ్రస్థాయిలో మండిపడింది. మంత్రి తీరుపై నిరసన వ్యక్తం చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఎం విజయ్ (CM Vijay) వెంటనే జోక్యం చేసుకుని మంత్రి తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పారు. "మా మంత్రి చేసింది తప్పే. ఆయన తరఫున మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను" అని విజయ్ పేర్కొన్నారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఆరోగ్య, రెవెన్యూ శాఖలకు సంబంధించిన పద్దులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా మంత్రి రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. వివాదాస్పదమైన "తిరుమంగళం ఫార్ములా"ను ప్రస్తావించారు. కాంచీపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.1,500 వరకు పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు. అయితే, తమ టీవీకే ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బు పంచకుండానే అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కేవలం 'కరుణానిధి' అని మాత్రమే సంబోధించారు.
సాధారణంగా తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధిని 'కలైంజర్' లేదా 'మాజీ ముఖ్యమంత్రి' అని గౌరవంతో పిలుస్తుంటారు. అందుకు విరుద్ధంగా మంత్రి గౌరవ సూచకాలు లేకుండా పేరు మాత్రమే ప్రస్తావించడం వివాదానికి కారణమైంది. ఆగ్రహించిన డీఎంకే సభ్యులు సభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Also Read..
విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్
ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల
- ●Kalwakuntla Kavitha | సామాజిక అన్యాయం అనాల్సిన రేవంతు.. సామాజిక న్యాయం అంటుండు
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ అప్డేట్.. ఇక తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు..
- ●Mallikarjun Kharge | నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్న పిల్లాడు.. మీరా మాకు దేశభక్తి పాఠాలు చెప్పేది..? ఖర్గే
- ●Vinod Kumar | అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతి ఉందా..? : మాజీ ఎంపీ వినోద్
- ●Peddi Sudarshan Reddy | కూల్చిన చోటే పెద్ది విగ్రహాన్ని పెట్టాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్

Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల

Kalwakuntla Kavitha | సామాజిక అన్యాయం అనాల్సిన రేవంతు.. సామాజిక న్యాయం అంటుండు

YouTube | యూట్యూబ్‌లో భారీ అప్డేట్.. ఇక తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు..

Mallikarjun Kharge | నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్న పిల్లాడు.. మీరా మాకు దేశభక్తి పాఠాలు చెప్పేది..? ఖర్గే






