త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | ఎట్ట‌కేల‌కు ఓ ఛాన్స్ – పౌరాణిక సినిమాలో నిధి అగ‌ర్వాల్ – లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌తో ప్ర‌యోగం

రాజాసాబ్ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. మైథాల‌జీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీ నిధి అగ‌ర్వాల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం ప్రారంభ‌మైంది. ఈ సినిమాకు తంత్ర ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

N

Entertainment | Published On Aug 18, 2026, 2.35 pm IST

Nidhhi Agerwal | ఎట్ట‌కేల‌కు ఓ ఛాన్స్ – పౌరాణిక సినిమాలో నిధి అగ‌ర్వాల్ – లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌తో ప్ర‌యోగం
Advertisement

Nidhhi Agerwal | రాజాసాబ్ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమా విడుద‌లై ఏడెనిమిది నెల‌లు దాటినా కొత్త మూవీని అనౌన్స్ చేయ‌లేదు ఈ బ్యూటీ. రాజాసాబ్‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు డిజాస్ట‌ర్స్‌తో ఈ ముద్దుగుమ్మ‌కు టాలీవుడ్‌లో మ‌రో అవ‌కాశం రావ‌డం క‌ష్ట‌మేనంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ రూమ‌ర్ల‌కు తెర‌దించుతూ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది నిధి అగ‌ర్వాల్‌.

పౌరాణిక క‌థ‌తో..

మైథాల‌జీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ కొత్త సినిమా నిధి అగ‌ర్వాల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. నిధి అగ‌ర్వాల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో యువ‌రాణిలా ఒంటినిండా ఆభ‌ర‌ణాల‌తో చేతిలో ప్ర‌మిద ప‌ట్టుకొని రాజాసాబ్ హీరోయిన్‌ క‌నిపిస్తోంది. ఆమె వెనుక కాళికా అమ్మ‌వారి విగ్ర‌హం క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. ఇందులో రెండు భిన్న కోణాల్లో నిధి అగ‌ర్వాల్ రోల్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఓ పురాణాల్లో ఎవ‌రికి తెలియ‌ని ఓ క‌థ‌తో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.
ఈ మైథాల‌జీ మూవీకి శ్రీనివాస్ గోపిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌తంలో తంత్ర అనే హార‌ర్ మూవీని చేశాడు ఈ డైరెక్ట‌ర్‌. అత‌డి సెకండ్ మూవీ ఇది.

ఫ‌స్ట్ మూవీ...

లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌లో నిధి అగ‌ర్వాల్ చేస్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఇందులో టాలీవుడ్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ హీరో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ సినిమాకు సునీత్ ప‌డొల్క‌ర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

స‌వ్య‌సాచితో ఎంట్రీ...

ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో మ‌రో రెండు సినిమాలు చేస్తున్న‌ట్లు నిధి అగ‌ర్వాల్ వెల్ల‌డించింది. నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో నిధి అగ‌ర్వాల్ యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్జు, ఇస్మార్ట్ శంక‌ర్‌, హీరో, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుతో పాటు రాజాసాబ్ సినిమాలు చేసింది. ఇందులో ఇస్మార్ట్ శంక‌ర్ మిన‌హా మిగిలిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి.

 

Advertisement

తాజావార్తలు

Advertisement