త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్‌ ఛాన్స్ – రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌సీ 17లో హీరోయిన్ ఫిక్స్‌

రామ్‌చ‌ర‌ణ్, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. మొన్న‌టివ‌ర‌కు ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో హీరోయిన్‌గా సారా అర్జున్ పేరు వినిపించింది. ఆమెతో పాటు అనీత్‌ప‌డ్డా, మ‌మితా బైజు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ వారంద‌రిని కాద‌ని అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్ ఛాన్స్ ఇచ్చారు.

N

Entertainment | Published On Oct 31, 2026, 2.57 pm IST

Satvika Veeravalli | అచ్చ తెలుగు అమ్మాయికి సుకుమార్‌ ఛాన్స్ – రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌సీ 17లో హీరోయిన్ ఫిక్స్‌
Advertisement

Satvika Veeravalli |  రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతుంది. అఫీషియ‌ల్‌గా లాంఛ్ కాక‌ముందే ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 17వ మూవీ ఇది. న‌వంబ‌ర్ 1న హైద‌రాబాద్‌లో ఈ పాన్ ఇండియ‌న్ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.

అచ్చ తెలుగు అమ్మాయి...

ఆర్‌సీ 17లో హీరోయిన్ విష‌యంలో అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాలో ఫ‌స్ట్ టైమ్ ఓ అచ్చ తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. ఆర్‌సీ 17లో క‌థానాయిక‌గా మొన్న‌టివ‌ర‌కు సారా అర్జున్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. ఆమెతో పాటు అనీత్ ప‌డ్డా, మ‌మితాబైజు పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి.

సాత్విక వీర‌వ‌ల్లి...

కానీ వీరంద‌రిని కాద‌ని తెలుగు అమ్మాయి సాత్విక‌ వీర‌వ‌ల్లిని హీరోయిన్‌గా సుకుమార్ క‌న్ఫామ్ చేసిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం రామ్‌చ‌ర‌ణ్, సాత్విక వీర‌వ‌ల్లిల‌పై సుకుమార్ ఫొటోషూట్ కూడా నిర్వ‌హించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు  సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. ఇందులో కొత్త హెయిర్‌స్టైల్‌, మేకోవ‌ర్‌తోరామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తున్నారు.

ఆకాశంలో ఒక తార‌...

దుల్క‌ర్ స‌ల్మాన్ ఆకాశంలో ఒక తార సినిమాతో సాత్విక వీర‌వ‌ల్లి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. తొలి సినిమా విడుద‌ల కాక‌ముందే రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో అవ‌కాశాన్ని అందుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆకాశంలో ఒక తార మూవీ న‌వంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

త‌బిత సుకుమార్‌...

రామ్‌చ‌ర‌ణ్ సినిమాను ఉద్దేశించి డైరెక్ట‌ర్ సుకుమార్ భార్య త‌బిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ మెగా ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా క‌థ‌ను రాయ‌డం కోసం సుకుమార్ ప‌డిన క‌ష్టం, ఆయ‌న ఫైర్ ద‌గ్గ‌రుండి చూశాన‌ని అన్న‌ది. రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌పై ఉన్న అంచ‌నాల కార‌ణంగా సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని అంద‌రితో పాటు తాను ఉత్సుక‌త‌గా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పింది. సుకుమార్ భార్య‌గా ఈ సినిమా విష‌యంలో తాను చాలా గ‌ర్వ‌ప‌డుతోన్న‌ట్లు పేర్కొన్న‌ది.

 

ట్యాగ్స్:

Ram CharanRam Charan Sukumar MovieRC 17 MovieRc 17 UpdateSatvika VeeravalliSukumarTelugu CinemaTelugu Movie NewsTollywood NewsUpcoming Telugu Movies
Advertisement
Advertisement