త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | నేను బ్యాలెట్‌లో లేను.. లేదంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ట్రంప్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

Donald Trump | అమెరికా మధ్యంతర ఎన్నికల (US midterm elections) ఫ‌లితాల‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. బ్యాలెట్‌పై తాను లేన‌ని.. ఒక‌వేళ తాను పోటీలో ఉండి ఉంటే రిపబ్లికన్ పార్టీ క‌చ్చితంగా భారీ మెజారిటీతో గెలిచేద‌ని వ్యాఖ్యానించారు.

D

International | Published On Nov 4, 2026, 11.54 am IST

Donald Trump | నేను బ్యాలెట్‌లో లేను.. లేదంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ట్రంప్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌
Advertisement

Donald Trump | త్రినేత్ర న్యూస్ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US midterm elections) డెమోక్రాట్లు (Democrats) ఊహించని రీతిలో భారీ విజయాలు సాధించారు. ప్రతినిధుల సభను కైవసం చేసుకోవడంతో పాటు, సెనేట్‌ను కూడా స్వాధీనం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నారు.పెరుగుతున్న జీవన వ్యయం, టారిఫ్‌లు, ఇరాన్‌తో అమెరికా యుద్ధం వంటి అంశాలపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి రిపబ్లికన్లపై (Republican Party) తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. బ్యాలెట్‌పై తాను లేన‌ని.. ఒక‌వేళ తాను పోటీలో ఉండి ఉంటే రిపబ్లికన్ పార్టీ క‌చ్చితంగా భారీ మెజారిటీతో గెలిచేద‌ని వ్యాఖ్యానించారు.

"నేను ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఒక వేళ నేను బ్యాలెట్‌పై ఉండి ఉంటే మేము భారీ మెజారిటీతో ఘ‌న విజ‌యం సాధించేవాళ్లం" అంటూ ట్రంప్ త‌న ట్రూత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్టారు. దీంతోపాటూ ఎరుపు రంగులో ఉన్న టోపీపై 'వీటో' అని ముద్రించిన చిత్రాన్ని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించినప్పటికీ అధ్యక్షుడిగా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని ఈ పోస్టు ద్వారా ఇచ్చిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తానని ట్రంప్‌ స్పష్టం చేశారు. డెమోక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు.

ఇది కూడా చ‌ద‌వండి.. ట్రంప్‌న‌కు మిడ్ ట‌ర్మ్‌ షాక్‌.. సెనేట్‌, ప్ర‌తినిధుల స‌భ విప‌క్షాల వ‌శం..!

కాగా, న‌వంబ‌ర్ 3న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రతిపక్ష డెమోక్రాట్లు (Democrats) అద్భుత విజ‌యం సాధించి యూఎస్ సెనేట్ (US Senate), ప్రతినిధుల సభ (House of Representatives) రెండింటిపై పూర్తి నియంత్రణను సాధించారు. రిపబ్లికన్ల కంచుకోటగా ఉన్న ఉత్తర కరొలినా, దక్షిణ కరొలినా, టెక్సాస్, కాన్సాస్, అయోవా, ఒహియో వంటి కీలక రాష్ట్రాల్లోని సెనేట్ స్థానాలను డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా కాన్సాస్‌లో దాదాపు 94 ఏళ్ల తర్వాత (1932 తర్వాత) ఒక డెమోక్రాట్ సెనేట్ స్థానాన్ని గెలుచుకోవడం విశేషం. ఈ ఫ‌లితాలు రిప‌బ్లిక‌న్లు, ట్రంప్‌కు చెంప పెట్టు అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేస్తున్నారు.

Also Read..

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా వందే భారత్‌ స్లీపర్‌.. వేగం, సౌకర్యాలు, టికెట్‌ ధరల్లో ఏది బెస్ట్‌?

ఐదో రోజూ లాభాల జోరు.. సెన్సెక్స్ 77 వేల పైకి, నిఫ్టీ 23,890కి..

ఫీజుల భారం.. రాష్ట్రంలో ఖాళీగా 175 ఎంబీబీఎస్ సీట్లు

ట్యాగ్స్:

DemocratsDonald TrumpHouse Of RepresentativesRepublican PartyUS Midterm ElectionsUS PresidentUS Senate
Advertisement
Advertisement