IRDAI | వాహనదారులకు భారీ ఊరట.. కావల్సిన ఇన్సూరెన్స్ ను ఎంచుకోవచ్చు..
IRDAI | వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి కార్లు, ద్విచక్ర వాహనాల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను నాలుగు విభాగాలుగా అందుబాటులోకి తీసుకురానుంది. వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను ఎంచుకునే అవకాశం కల్పించనుంది.
IRDAI | వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి కార్లు, ద్విచక్ర వాహనాల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను నాలుగు విభాగాలుగా అందుబాటులోకి తీసుకురానుంది. వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను ఎంచుకునే అవకాశం కల్పించనుంది.
మోటార్ ఇన్సూరెన్స్ విధానంలో కీలక మార్పులు చేస్తూ ఐఆర్‌డీఏఐ నాలుగు అంచెల బీమా నిర్మాణాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం థర్డ్ పార్టీ లయబిలిటీ, వాహనంలో ప్రయాణించే వ్యక్తులు లేదా ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చునే వారి పట్ల చట్టపరమైన బాధ్యత కవరేజీ, వ్యక్తిగత ప్రమాద బీమా, సొంత వాహనానికి జరిగే నష్టం లేదా ప్రమాదాల వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన ఓన్ డ్యామేజ్ కవరేజీగా నాలుగు విభాగాలు ఉంటాయి. వీటిలో థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి కాగా, మిగిలిన కవరేజీలను వినియోగదారులు తమ అవసరాలను బట్టి ఎంచుకోవచ్చు. అయితే వాహన యజమానులకు వర్తించే తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి.
పాలసీల్లో పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు..
ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాలకు మోటార్ ఇన్సూరెన్స్ అందించే అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకే విధమైన పాలసీ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రతి వినియోగదారుడి నుంచి బీమా కవరేజీల ఎంపికకు సంబంధించిన ఆప్షన్ ఫామ్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తప్పనిసరిగా తీసుకోవాలి. పాలసీ జారీ చేసే సమయంలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్) అందించాలి. ఇందులో ఒక్కో కవరేజీ ద్వారా లభించే రక్షణ, దానికి సంబంధించిన ప్రీమియం వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఇప్పటికే పాలసీ కలిగి ఉన్నవారు కూడా అదనపు ప్రీమియం చెల్లించి, తమ పాలసీ గడువు ముగియకముందే ప్రయాణికులు లేదా వెనుక కూర్చునే వారి కోసం చట్టపరమైన బాధ్యత కవరేజీని జోడించవచ్చు.
బీమా కంపెనీలకు ధరల నిర్ణయంలో వెసులుబాటు..
పాలసీ నిర్మాణం, నిబంధనలను ప్రామాణీకరించినప్పటికీ, ఓన్ డ్యామేజ్ బీమా ధరలను నిర్ణయించడంలో కంపెనీలకు స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త బీమా కవరేజీలను కూడా ప్రవేశపెట్టవచ్చు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ తుంగాల ధనలక్ష్మి తదితరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. అలాగే డిసెంబర్ 15 నాటికి నాలుగు అంచెల మోటార్ ఇన్సూరెన్స్ విధానాన్ని బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలని బీమా కంపెనీలను ఆదేశించింది. దీంతో కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే పాలసీలు బీమా సుగమ్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్‌డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..
అక్టోబర్ 17, 2026

IRDAI | ఐఆర్‌డీఏఐ కొత్త ప్రతిపాదనలతో బీమా స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి.. ఏ స్టాక్ అయితే బెటర్..?
సెప్టెంబర్ 28, 2026

PB Fintech | పాలసీ బజార్ షేర్లకు ఊరట.. 4 శాతం జంప్.. కొనాలా.. వేచి చూడాలా..?
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●iPhone 16 | అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులను ఐఫోన్లతో సర్ప్రైజ్ చేసిన సంస్థ
- ●Jeevan Reddy | తెలంగాణకు పట్టిన శని రేవంత్ రెడ్డి.. మూడేండ్లలో రెండు పిల్లర్లకు మరమ్మతులు కూడా చేయలే: జీవన్ రెడ్డి
- ●Donald Trump | నేను బ్యాలెట్లో లేను.. లేదంటే.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్లలో జోరు.. పసిడి కొనుగోళ్లకు సైతం మొగ్గు..
- ●US midterm elections | ట్రంప్‌నకు మిడ్ టర్మ్ షాక్.. సెనేట్, ప్రతినిధుల సభ విపక్షాల వశం..
- ●Vande Bharat Sleeper vs Rajdhani Express | రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా వందే భారత్ స్లీపర్.. వేగం, సౌకర్యాలు, టికెట్ ధరల్లో ఏది బెస్ట్?

iPhone 16 | అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులను ఐఫోన్లతో సర్ప్రైజ్ చేసిన సంస్థ

Jeevan Reddy | తెలంగాణకు పట్టిన శని రేవంత్ రెడ్డి.. మూడేండ్లలో రెండు పిల్లర్లకు మరమ్మతులు కూడా చేయలే: జీవన్ రెడ్డి

Donald Trump | నేను బ్యాలెట్లో లేను.. లేదంటే.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్లలో జోరు.. పసిడి కొనుగోళ్లకు సైతం మొగ్గు..



