త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Police | వాళ్లు చేసిన నేరమేమిటంటే? సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ఢిల్లీ పోలీసుల ఫుల్ ఎక్స్‌ప్లనేషన్

జంతర్ మంతర్ వద్ద CJP సభ్యులను ఎందుకు అరెస్ట్ చేశారు? సౌరవ్ దాస్, అశుతోష్‌లకు 5 రోజుల కస్టడీ విధించడంపై ఢిల్లీ పోలీసులు ఇచ్చిన పూర్తి వివరణ ఇదే.

J

National | Published On Oct 14, 2026, 2.29 pm IST

Delhi Police | వాళ్లు చేసిన నేరమేమిటంటే? సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ఢిల్లీ పోలీసుల ఫుల్ ఎక్స్‌ప్లనేషన్

సంక్షిప్త సారాంశం

అక్టోబర్ 13న నిరసనలకు అనుమతి లేని జంతర్ మంతర్‌లోకి ప్రైవేట్ స్థలం గుండా అక్రమంగా ప్రవేశించిన 14 మంది కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యులు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్ (FIR)ల నమోదు. సోషల్ మీడియా ద్వారా ఇతరులను రెచ్చగొడుతున్నారన్న కారణంతో బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ల కింద సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండేల అరెస్ట్. సౌరవ్ దాస్, అశుతోష్‌లకు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా, రూ.5,000 పూచీకత్తుపై అజింక్య షిండేకు షరతులతో కూడిన ఊరటనిచ్చిన కోర్టు.

Advertisement

Delhi Police | త్రినేత్ర న్యూస్ : జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల అరెస్ట్ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు అధికారికంగా వివరణ (Explanation) ఇచ్చారు. అక్టోబర్ 13, 2026 ఉదయం సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండేలతో పాటు మరో 11 మంది CJP సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, అందుకే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రైవేట్ స్థలం గుండా అక్రమ ప్రవేశం

జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలంగా (Designated protest site) డీనోటిఫై చేసినప్పటికీ, మొత్తం 14 మంది CJP సభ్యులు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ గుండా అక్రమంగా (Trespassing) అక్కడికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు.

అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిరసనకారులు పోలీసుల అధికారిక విధులకు ఆటంకం కలిగించారని వెల్లడించారు.

Also Read | పార్టీ పెట్టం. ప్రెజర్ గ్రూప్ గానే ఉంటాం

రెండు పోలీస్ స్టేషన్లలో FIR నమోదు

ఈ ఘటనతో మొత్తం 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 13న వీరిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్: FIR నంబర్ 289/26 (సెక్షన్లు 223a/332/61(2) కింద)

పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్: FIR నంబర్ 128/26 (సెక్షన్లు 221/115(2)/132/121(1)/3(5) కింద)

అనంతరం ఈ కేసుల్లో చట్టప్రకారం వారందరినీ బౌండ్ డౌన్ (Bound down) చేశారు.

సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పదేపదే చట్టాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తుండటంతో.. అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండేలను ప్రివెంటివ్ (ముందస్తు కట్టడి) నిబంధనల కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేలా వీరు సోషల్ మీడియా ద్వారా ఇతరులను రెచ్చగొడుతున్న (Instigate) విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు.

5 రోజుల కస్టడీ.. ఒకరికి షరతులతో కూడిన ఊరట

అరెస్ట్ చేసిన ఈ ముగ్గురినీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) ముందు హాజరుపరిచి, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126/170 కింద ప్రొసీడింగ్స్ ప్రారంభించారు.

పోలీసులు సమర్పించిన వివరాలను, వీరు పదేపదే చట్టాన్ని ఉల్లంఘించిన తీరును SEM కోర్టు పరిశీలించింది. ఒకవేళ వీరికి బెయిల్ ఇస్తే మళ్లీ చట్టాన్ని ఉల్లంఘిస్తారని, ఇతరులను కూడా చట్టవ్యతిరేక చర్యలకు పురిగొల్పుతారన్న తీవ్ర ఆందోళనతో సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

మరోవైపు.. ఆరు నెలల పాటు శాంతియుతంగా, సత్ప్రవర్తనతో ఉండాలనే షరతుపై రూ. 5,000 వ్యక్తిగత బాండ్, ష్యూరిటీతో అజింక్య షిండేను బౌండ్ డౌన్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి | సీజేపీ నేత‌ల‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ.. తీహార్ జైలుకు సౌర‌వ్ దాస్‌, రాంకా 

Advertisement
Advertisement