RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్‌బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
RRB Recruitment | భారతీయ రైల్వేలోని (Indian Railways) వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3993 పోస్టులకు దరఖాస్తులు (RRB Recruitment) ఆహ్వానిస్తున్నది.
RRB Recruitment | త్రినేత్ర.న్యూస్: భారతీయ రైల్వేలోని (Indian Railways) వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3993 పోస్టులకు దరఖాస్తులు (RRB Recruitment) ఆహ్వానిస్తున్నది. ఆగస్టు 14న దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, స్టోర్స్ వంటి విభాగాలకు సంబంధించి ఈ పోస్టులు ఉన్నాయి. వీటికి ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ప్రతి నెల ప్రారంభ వేతనం రూ.35,400 అందుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్‌లో 110 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 3993 (జనరల్ 1699, ఎస్సీ 624, ఎస్టీ 363, ఓబీసీ 913, ఈడబ్ల్యూఎస్ 394)
విభాగాల వారీగా..
ఇంజినీరింగ్- 1638 (జనరల్ 670, ఎస్సీ 259, ఎస్టీ 140, ఓబీసీ 407, ఈడబ్ల్యూఎస్ 162)
మెకానికల్- 1125 (జనరల్ 464, ఎస్సీ 182, ఎస్టీ 110, ఓబీసీ 251, ఈడబ్ల్యూఎస్ 118)
ఎలక్ట్రికల్- 599 (జనరల్ 279, ఎస్సీ 79, ఎస్టీ 50, ఓబీసీ 131, ఈడబ్ల్యూఎస్ 60)
స్టోర్స్- 324 (జనరల్ 139, ఎస్సీ 57, ఎస్టీ 29, ఓబీసీ 69, ఈడబ్ల్యూఎస్ 30)
ఎస్ అండ్ టీ- 307 (జనరల్ 6147, ఎస్సీ 47, ఎస్టీ 34, ఓబీసీ 55, ఈడబ్ల్యూఎస్ 24)
- సికింద్రాబాద్ రీజియన్‌లో- 110 (జనరల్ 68, ఎస్సీ 15, ఎస్టీ 6, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 9)
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. 2027 జనవరి 1 నాటికి 18 ఏండ్ల నుంచి 33 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
జూనియర్ ఇంజినీర్- సంబంధిత విభాగంలో మూడేండ్ల డిప్లొమా లేదా బీఈ, బీటెక్
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్- ఇంజినీరింగ్ డిప్లొమా
మెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్- ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (రెండు దశల్లో), డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, రైల్వే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. రాత పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం, ఓబీసీలు 30 శాతం, ఎస్సీ అభ్యర్థులు కనీసం 30 శాతం, ఎస్టీ అభ్యర్థులు కనీసం 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
రాతపరీక్ష
మొదటి దశ (CBT-1): ఇది స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. ఈ పరీక్షలో పొందిన మార్కులను తుది మెరిట్ జాబితా కోసం పరిగణించరు. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలుగా ఉండాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు.
- గణితం- 30 మార్కులకు 30 ప్రశ్నలు
- జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్- 25 మార్కులకు 25 ప్రశ్నలు
- జనరల్ అవేర్‌నెస్- 15 మార్కులకు 15 ప్రశ్నలు
- జనరల్ సైన్స్‌ల- 30 మార్కులకు 30 ప్రశ్నలు
రెండవ దశ పరీక్ష (CBT-2)
CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే CBT-2కు అనుమతిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు. ఈ పరీక్షలో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. దీనిని 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు.
- జనరల్ అవేర్‌నెస్- 15 ప్రశ్నలకు 15 మార్కులు
- ఫిజిక్స్, కెమిస్ట్రీ (10వ తరగతి స్థాయి)- 15 ప్రశ్నలకు 15 మార్కులు
- బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్- 10 ప్రశ్నలకు 10 మార్కులు
- బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్- 10 ప్రశ్నలకు 10 మార్కులు
- టెక్నికల్ ఎబిలిటీస్- 100 ప్రశ్నలకు 100 మార్కులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 13
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.250
వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/ లేదా https://rrb.indianrailways.gov.in/
సంబంధిత వార్తలు

Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
అక్టోబర్ 16, 2026

Special Trains | పండుగల వేళ ప్రయాణిలకు శుభవార్త.. గుంటూరు, యశ్వంత్‌పూర్‌కు ప్రత్యేక రైళ్లు
అక్టోబర్ 8, 2026

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!
- ●TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!
- ●Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్
- ●Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
- ●TGSRTC | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
- ●Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?

MEA | అక్టోబర్ 20న ముంబయిలో జైశంకర్–రూబియో భేటీ!

TGSRTC | భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త.. అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు!

Mahesh Kumar Goud | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వండి.. సీపీఎం నేతలను కోరిన పీసీసీ చీఫ్

Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!



