త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | మ‌రికాసేప‌ట్లో నెక్లెస్ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | మ‌హాత్మా జ్యోతిబా పూలే దంప‌తుల విగ్ర‌హావిష్క‌ర‌ణ నేప‌థ్యంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి నెక్లెస్ రోడ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

S

Hyderabad | Published On Aug 14, 2026, 1.23 pm IST

Traffic Restrictions | మ‌రికాసేప‌ట్లో నెక్లెస్ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : మ‌హాత్మా జ్యోతిబా పూలే దంప‌తుల విగ్ర‌హావిష్క‌ర‌ణ నేప‌థ్యంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి నెక్లెస్ రోడ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మం ముగిసే దాకా ట్రాఫిక్ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

  • స‌చివాల‌యం నుంచి ఐమ్యాక్స్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌కు ఖైర‌తాబాద్ ఫ్లై ఓవ‌ర్‌, వీవీ విగ్ర‌హం వైపు మ‌ళ్లించ‌నున్నారు. పీపుల్స్ ప్లాజా, వీవీ విగ్ర‌హం నుంచి ఐమ్యాక్స్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను సెక్ర‌టేరియ‌ట్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
  • ఇక్బాల్ మీనార్ నుంచి మర్రి చెట్టు, మింట్ కంపౌండ్, ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోట‌రీ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను స‌చివాల‌యం జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు.
  • బ‌డా గ‌ణేశ్ నుంచి నెక్లెస్ రోట‌రీ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను మింట్ కంపౌండ్ లేన్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
  • త‌దిత‌ర వివ‌రాల కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబ‌ర్ 9010203626 ను సంప్ర‌దించొచ్చు.
Advertisement
Advertisement