Delhi Govt | ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్‌ఫ్రం హోం.. సీఎం కీలక ప్రకటన
Delhi Govt | ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కీలక ప్రకటన చేసింది. ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పని వెసులుబాటు కల్పించింది.
Delhi Govt | ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కీలక ప్రకటన చేసింది. ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పని వెసులుబాటు కల్పించింది. ఇంధన ఆదా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (CM Rekha Gupta) గురువారం ప్రకటించారు. అంతేకాదు, ఇకపై 50 శాతం అధికారిక సమావేశాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేశారు. ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా ఢిల్లీ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఒక రోజును "మెట్రో డే"గా, వారానికి ఒకసారి "నో కార్ డే" పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
కార్‌పూలింగ్‌ను అలవాటు చేసుకోండి..
పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు రేఖా గుప్తా సర్కార్ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలను వదిలి.. మెట్రో, బస్సుల్లో ప్రయాణించాలని సూచించింది. మంత్రులు సైతం పొదుపు సూత్రాన్ని పాటించాలని విన్నవించింది. కార్‌పూలింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించింది. క్షేత్రస్థాయి పర్యటనలు, తనిఖీలు, ప్రారంభోత్సవాల సమయంలో అధికారులు వేర్వేరు వాహనాల్లో వెళ్లకుండా.. ఒకే వాహనాన్ని వాడుకోవాలని చెప్పింది. ప్రయాణాలను మానుకొని.. వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
ఇంధన పొదుపు ప్రజా ఉద్యమంగా మారాలి..
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ శాఖల అధికారులు తమ అధికారిక వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సీఎం రేఖా గుప్తా (CM Rekha Gupta) సూచించారు. ప్రైవేట్ వాహనాలకు బదులుగా బస్సులు, మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇంధన పొదుపు అనేది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనం కోసం మనం పాటించే చిన్నిపాటి నియమాలు పెద్ద మార్పును తీసుకొస్తాయని నొక్కి చెప్పారు.
కాలుష్యం కూడా తగ్గుతుంది..
ఢిల్లీ, రాజధాని ప్రాంతం అంతటా మెట్రో రైళ్లు, డీటీసీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెట్రోల్, డీజిల్ చాలా వరకూ ఆదా అవుతుందన్నారు. అంతేకాదు, రాజధానిలో ట్రాఫిక్ రద్దీ, ముఖ్యంగా కాలుష్య స్థాయిలు కూడా గణనీయంగా తగ్గుతాయని సీఎం రేఖా గుప్తా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అధికారులు, మంత్రులు విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారిక లేదా వ్యక్తిగత కారణాలతో విదేశాలకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మంజూరైన విదేశీ పర్యటనల సెలవులను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Also Read..
యూపీలో తుఫాను బీభత్సం.. ఒక్కరోజే 100 మంది మృతి
మూడో దశ సర్‌పై ఈసీ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?
ట్యాబ్లెట్‌తోనే అధిక బరువు తగ్గింపు.. కొత్త వెగోవీ స్టడీ సంచలనం..
సంబంధిత వార్తలు

PM Modi SRCC Speech | 13 ఏళ్ల తర్వాత అదే వేదిక.. మళ్లీ అదే ‘గ్లాస్’ కథ.. ఆ కాలేజీలో ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం
సెప్టెంబర్ 6, 2026

PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!
సెప్టెంబర్ 5, 2026

PM Modi | పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయాలి.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి
- ●KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం
- ●Malvika Sharma | ఇంత ప్రేమ దక్కుతుందని ఊహించలేదు.. అభిమానుల రెస్పాన్స్‌కు మాళవిక శర్మ ఫిదా..!
- ●Kayadu Lohar | పొడవాటి జడ.. ట్రెడిషనల్ లుక్.. కయదు అదుర్స్!

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక

Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

KCR | బూతులు మాట్లాడేవారితో చర్చా.. అసెంబ్లీకి కాదు.. ప్రజల్లోకి వెళ్దాం



