Nepal Flash Floods | నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు : విదేశాంగ శాఖ
Nepal Flash Floods | నేపాల్ వరదల్లో 320 మంది భారతీయ పౌరులు గల్లంతైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రమాదం నుంచి బయటపడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన 21 మంది ఇవాళ ఇండిగో విమానంలో ఢిల్లీ చేరుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 588కి పెరిగింది.
- 588కి పెరిగిన మృతుల సంఖ్య
- ఢిల్లీ చేరుకున్న 21 మంది తమిళనాడు యాత్రికుల బృందం
- ముంచుకొస్తున్న డెడ్లీ వరద.. హై అలర్ట్‌లో నేపాల్
- సహాయక చర్యలు నిలిపివేత
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్ : నేపాల్‌లో సంభవించిన వినావకరమైన ఆకస్మిక వరదల (Nepal Flash Floods) కారణంగా 320 మంది భారతీయ పౌరులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం తెలిపింది. 85 మంది భారతీయుల్ని నేపాల్ నేవీ సురక్షితంగా రక్షించినట్లు పేర్కొంది. ప్రమాదం నుంచి బయటపడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన 21 మంది ఇవాళ ఇండిగో విమానంలో ఢిల్లీ చేరుకున్నట్లు తెలిపింది.
విలేకరుల సమావేశంలో MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) మాట్లాడుతూ.. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులు సైతం సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. చైనా ఆవల చిక్కుకుపోయిన 96 మంది భారతీయులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్‌లోకి ప్రవేశించినట్లు చెప్పారు. వారిని మరింత సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడి ఎంబసీ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అదే సమయంలో గల్లంతైన పౌరుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్పారు.
ఇప్పటి వరకూ 320 మంది కాంటాక్ట్ నుంచి మిస్సైనట్లు వివరించారు. ఈ సంఖ్య మారుతూ ఉంటుందని తెలిపారు. 100 మంది భారత సంతతికి చెందిన వ్యక్తుల ఆచూకీ కూడా తెలియడం లేదన్నారు. చైనా వైపు 400 మంది భారత పౌరులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఖాఠ్మాండూ నుంచి న్యూ ఢిల్లీ చేరుకున్న 21 మంది యాత్రికుల బృందానికి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి తాజా పరిస్థితులను, వారికి ఎదురైన భయానక అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.
588కి పెరిగిన మృతుల సంఖ్య
నేపాల్‌లో బుధవారం సంభవించిన జలప్రళయం (Nepal Flash Floods) పెను విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి చేసిన విలయతాండవానికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 588కి పెరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న 1,403 మందిని అధికారులు రక్షించారు. వారికి స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. 1,498 మంది ఆచూకీ గల్లంతైంది. 27 మంది పోలీసు సిబ్బంది ఆచూకీ కూడా తెలియడం లేదు. గల్లంతైన భారతీయుల ఆచూకీ సైతం ఇప్పటికీ తెలియరాలేదు.
పొంచి ఉన్న ముప్పు.. సహాయక చర్యలు నిలిపివేత
నేపాల్‌కు వరద ముప్పు ఇంకా తొలగిపోలేదు. టిబెట్ వైపు ఉన్న ఓ సరస్సు కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. దీంతో నేపాల్‌లో మరోసారి వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏ క్షణమైనా వరద ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ పోలీసులు (Nepal Police) హెచ్చరించారు. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న పోలీసులు, సహాయక సిబ్బంది, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. మొన్న సంభవించిన ఆకస్మిక వరదల కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ తీవ్రతతో మరో డెడ్లీ వరద ముంచుకొస్తోందని హెచ్చరించారు. మరోసారి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలను నేపాల్ నిలిపివేసింది. అటు చైనా సైతం టిబెట్ వైపు సహాయక చర్యలను ఆపేసింది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని అటు అధికారులు, ఇటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
బీహార్ గ్రామాల్లో హై అలర్ట్
నేపాల్ వరద హెచ్చరికలతో భారత్‌లోని బీహార్ సరిహద్దు గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గండకీ నది బ్యారేజ్‌కు వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్యారేజ్‌లో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. వరద ముప్పు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దు గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గండకీ నదిలోకి కొట్టుకొచ్చిన మృతదేహాలు
నేపాల్ వరదల్లో మరణించిన వారి మృతదేహాలు గండకీ నదిలోకి కొట్టుకొచ్చాయి. ఇవాళ నదిలో తేలుతున్న మూడు మృతదేహాలను భారత సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్ (SSB) గుర్తించి మోటార్ బోట్ల సహాయంతో వెలికితీశారు.
Also Read..
అలాంటి సినిమాలు పిల్లలు చూస్తే ఏంటి పరిస్థితి..? టాక్సిక్‌పై అన్నామలై ఫైర్
రూ.1 లక్ష పెట్టుబడికి రూ.44 లక్షల లాభం.. ఎఫ్ అండ్ వో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మాయ..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
సెప్టెంబర్ 8, 2026

Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
సెప్టెంబర్ 5, 2026

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



