Annamalai | అలాంటి సినిమాలు పిల్లలు చూస్తే ఏంటి పరిస్థితి..? టాక్సిక్‌పై అన్నామలై ఫైర్
Annamalai | రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' (Toxic) చిత్రంపై తమిళనాడు బీజేపీ మాజీ నేత కే అన్నామలై (Annamalai) తీవ్రంగా స్పందించారు. ఇందులో మహిళలను తప్పుగా చూపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలను పిల్లలు చూస్తే అది వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Annamalai | త్రినేత్ర.న్యూస్ : రాకింగ్ స్టార్ యశ్ (Yash) కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన 'టాక్సిక్' (Toxic) చిత్రం విడుదలైన ఒక్కరోజులోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో మితిమీరిన హింస, మహిళలను కించపరిచేలా ఉన్న (Misogynistic) సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ చిత్రంపై వీ ద లీడర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, తమిళనాడు బీజేపీ మాజీ నేత కే అన్నామలై (Annamalai) తీవ్రంగా స్పందించారు.
ఈ సినిమా ఒక్క రోజులోనే రూ.104 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. ఇందులో మహిళలను అతిగా లైంగికంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకే కోణంలో చూపించే ఇలాంటి సినిమాలను పిల్లలు చూస్తే అది వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై సమాజంలో అవగాహన కల్పిస్తున్న సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇలాంటి చిత్రాలకు ఎలా అనుమతి ఇస్తోంది..? అంటూ ప్రశ్నించారు. సినిమాల్లో మహిళలను గౌరవించే విధానం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సినిమాల్లో విపరీతమైన హింస, మహిళలను కించపరిచేలా చూపించడం వంటి అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వ్యవహరిస్తున్న తీరును అన్నామలై తీవ్రంగా తప్పుపట్టారు. నిబంధనలను కఠినతరం చేయాలని అభిప్రాయపడ్డారు. పెద్ద నటుల చిత్రాలైనా సరే.. ఏ సన్నివేశాలు అనుమతించాలో సెన్సార్ బోర్డు నిర్ణయించాలన్నారు. సినిమా సర్టిఫికేషన్ విషయంలో సెన్సార్ బోర్డ్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
Also Read..
స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్
పాక్ కోసం గూఢచర్యం.. దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు సిమ్ కార్డులు.. దంపతులు అరెస్ట్
సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ స్పెషల్ సర్‌ప్రైజ్.. గోల్డ్ రాఖీని కట్టిన మంత్రి
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు






