త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Student Ties Rakhi to Modi | ప్రధాని మోదీకి ఢిల్లీలో రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని

ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఓ తెలుగు విద్యార్థిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీకి స్వయంగా రాఖీ కట్టి తన ఆనందాన్ని పంచుకున్నారు.

J

National | Published On Aug 28, 2026, 4.07 pm IST

Telugu Student Ties Rakhi to Modi | ప్రధాని మోదీకి ఢిల్లీలో రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని
Advertisement
  • ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
  • దేశ నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో పాటు పాల్గొన్న తెలుగు అమ్మాయి సాయి మధుమిత
  • ప్రధాని మోదీకి స్వయంగా రాఖీ కట్టి మురిసిపోయిన 12వ తరగతి విద్యార్థిని
  • ఢిల్లీ స్కూల్స్ నుంచి అటెండ్ అయిన వాళ్లలో ఒకే ఒక్క తెలుగు విద్యార్థిని 
  • పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించి, దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Telugu Student Ties Rakhi to Modi | త్రినేత్ర.న్యూస్ : రక్షాబంధన్ (Raksha Bandhan) పర్వదినాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో సందడి నెలకొంది. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఉత్సాహంగా రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. విశేషమేమిటంటే, ఈ కార్యక్రమంలో ఓ తెలుగు విద్యార్థిని ప్రధానికి రాఖీ కట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఢిల్లీలో 12వ తరగతి (MBiPC) చదువుతున్న తెలుగు అమ్మాయి సాయి మధుమితకు ఈ అరుదైన అవకాశం దక్కింది. దేశ నలుమూలల నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు, చిన్నారులతో కలిసి ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా దేశ ప్రధానికి రాఖీ కట్టడం తన జీవితంలో మర్చిపోలేని బ్యూటిఫుల్ మూమెంట్ (Beautiful moment) అని సాయి మధుమిత సంతోషం వ్యక్తం చేశారు.

ఢిల్లీకి చెందిన అన్ని స్కూళ్ల నుంచి వచ్చిన వంద మంది విద్యార్థుల్లో సాయి మధుమిత ఒకే ఒక్క తెలుగు అమ్మాయిగా నిలిచారు. ఢిల్లీలోని ప్రసాద్ నగర్‌లో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన డా.బి.వి.నాథ్ అండ్ టి.ఆర్.రావు మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో మధుమిత ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నారు.

ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, హై-ఫైవ్స్ (High-fives) ఇస్తూ సందడి చేశారు. రాఖీలు కట్టించుకుంటున్న సమయంలో విద్యార్థుల పేర్లు, వారు చదువుతున్న క్లాస్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, చిన్నారులు అడిగిన పలు క్యూట్ ప్రశ్నలకు ఆయన చిరునవ్వుతో సమాధానాలిచ్చారు.

ఈ స్పెషల్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ తన సోషల్ మీడియా (Social Media) ఖాతాల ద్వారా పంచుకున్నారు. రక్షాబంధన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయతలను, సామరస్య బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకుంటూ దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
Advertisement