త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Death penalty | మూడేళ్ల చిన్నారిపై హ‌త్యాచారం కేసులో వృద్ధుడికి మ‌ర‌ణ‌శిక్ష‌.. ఘోరం జ‌రిగిన 60 రోజుల్లోనే తీర్పు

Death penalty | మూడేళ్ల అమాయక చిన్నారిపై ఓ వృద్ధుడు అమానుషంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన కేసులో మహారాష్ట్ర పూణె (Pune) సెషన్స్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. నిందితుడికి మ‌ర‌ణ శిక్ష (Death penalty) విధించింది.

D

National | Published On Jun 29, 2026, 4.13 pm IST

Death penalty | మూడేళ్ల చిన్నారిపై హ‌త్యాచారం కేసులో వృద్ధుడికి మ‌ర‌ణ‌శిక్ష‌.. ఘోరం జ‌రిగిన 60 రోజుల్లోనే తీర్పు
Advertisement

Death penalty | మూడేళ్ల అమాయక చిన్నారిపై ఓ వృద్ధుడు అమానుషంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన కేసులో మహారాష్ట్ర పూణె (Pune) సెషన్స్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో 65 ఏళ్ల వృద్ధుడు భీమ్‌రావ్ కాంబ్లేని దోషిగా తేల్చింది. ఈ మేర‌కు అత‌డికి మ‌ర‌ణ శిక్ష (Death penalty) విధించింది. అది కూడా ఘోరం జ‌రిగిన 60 రోజుల్లోనే ఈ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించ‌డం విశేషం.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

పూణె జిల్లా న‌స్రాపూర్ గ్రామానికి (Nasrapur village) చెందిన 65 ఏళ్ల భీమ్‌రావ్ కాంబ్లే ఈ ఏడాది మే 1వ తేదీన‌ తినుబండారాలు ఇస్తానని, అలాగే చిన్న దూడను చూపిస్తానని ఆశ చూపి మూడేళ్ల చిన్నారిని స‌మీపంలోని ప‌శువుల పాక‌లోకి తీసుకెళ్లాడు. అక్క‌డ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టి ఆపై హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత ఏమీ తెలియ‌న‌ట్లు వ‌చ్చిన దారినే వెళ్లిపోయాడు.

చిన్నారి క‌నిపించ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న చెందారు. బాలిక కోసం తీవ్రంగా గాలించ‌గా.. ప‌శువుల పాక‌లో చిన్నారి మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై బాధిత కుటుంబం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘోర ఉదంతం స్థానికంగా ఆగ్ర‌హావేశాల‌కు దారితీసింది. గ్రామ‌స్థులు పెద్ద ఎత్తున నిర‌స‌నలు, రాస్తారోకోలు చేప‌ట్టారు. నిందితుడికి అత్యంత క‌ఠిన‌మైన శిక్ష ప‌డాల‌ని డిమాండ్ చేస్తూ పూణె, ప‌రిస‌ర ప్రాంతాల్లో స్థానికులు పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.

మ‌రోవైపు సంఘటన జరిగిన రోజే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. కేవలం 16 రోజుల్లోనే 1,200 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. జూన్ 25న నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ త‌న తీర్పును వెలువ‌రించింది. అయితే శిక్షకు సంబంధించిన తీర్పును జూన్ 29కి వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో నేడు కోర్టు త‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసును అత్యంత అరుదైన కోవలోకి వస్తుందని అభిప్రాయపడింది. "నిందితుడు సమాజానికి ఇప్పటికీ ప్రమాదకరమైనవాడే. అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, మారాల‌నే ఉద్దేశం ఉన్న‌ట్లుగానీ కనిపించడం లేదు. ఇలాంటి క్రూరమైన నేరానికి మరణశిక్ష మాత్రమే సరైన న్యాయం" అని కోర్టు వ్యాఖ్యానించింది.

చిన్నారికి న్యాయం జ‌రిగింది: సుప్రియా సూలే

కోర్టు తీర్పు తీర్పును నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే (MP Supriya Sule) స్వాగ‌తించారు. బాధితురాలికి, ఆ కుటుంబానికి న్యాయం జ‌రిగింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. "ఎట్టకేలకు ఆ చిన్నారికి న్యాయం జరిగింది. మేమంతా ఈ తీర్పును స్వాగతిస్తున్నాము. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరం. నిందితుడికి క‌చ్చితంగా మరణశిక్ష పడుతుందని ఆశించాం" అని తెలిపారు. అంతేకాదు, ఈ కేసు దర్యాప్తు అధికారుల‌కు సూలే ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement
Advertisement