త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..

TGSRTC | టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC)లో యూనియన్ ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం వేగంగా కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు ముమ్మ‌రం చేసింది.

P

Telangana | Published On Jun 29, 2026, 5.48 pm IST

TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..
Advertisement

TGSRTC | టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC)లో యూనియన్ ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం వేగంగా కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు ముమ్మ‌రం చేసింది. ఎన్నికల నిర్వహణ అధికారిగా ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమిషనర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమగ్ర వివరాలు తీసుకున్నారు. ఈ భేటీతో యూనియన్ వేరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, బూత్ ఇన్‌ఛార్జ్‌ల జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారికి అందజేసింది. ఎన్నికలు ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా జరగాలన్న లక్ష్యంతో యాజమాన్యం సమన్వయంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే మరో రెండు, మూడు రోజుల్లో తొలి నోటీసు జారీ చేయడానికి ఎన్నికల నిర్వహణ అధికారి (జాయింట్ లేబర్ కమిషనర్) ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియ మరింత స్పష్టమైన దశలోకి ప్రవేశించనుంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిచేయాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల అధికారితో నిరంతరం సమన్వయం కొనసాగిస్తోంది.

Advertisement
Advertisement