Ntr | అఫీషియల్ – ఒకే ఆయుధం…ఒకే లక్ష్యం – ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ ట్రెండింగ్
ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గాడ్ ఆఫ్ వార్ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సోమవారం ఈ మూవీ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. మైథాలజీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు.
Entertainment | Published On Jun 29, 2026, 5.40 pm IST
Ntr |యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో మరో సారి సెట్టయ్యింది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత వీరిద్దరి కలయికలో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. గాడ్ ఆఫ్ వార్‌గా పురాణాలు అభివర్ణించిన కుమారస్వామి కథతో ఈ సినిమా రూపొందనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
త్రిశూలం
సైన్స్, భక్తి అంశాలతో ముడిపడి ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో శివుడి ఆయుధమైన త్రిశూలం కనిపిస్తోంది. దానితో పాటు పొగ, మేఘాల రూపంలో డీఎన్ఏ ఆకారం ఉండటం ఆసక్తిని పంచుతోంది. యుద్ధంలో ఎదురైన వినాశనాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో చూపించారు. మృతదేహాలపై కనిపిస్తోన్న బాణాలు, రక్తపాతం, మంటలతో నిండిపోయిన ఓ ప్రాంతం కనిపిస్తోంది. వాటి వెనుక పురాతన దేవాలయాలు, కోట గోడలు ఉన్నాయి. త్రిశూలం కింద "ఓం న జానామి శబ్దం న జానామి చార్థం అంటూ ఓ శ్లోకం కనిపిస్తోంది. నాకు శబ్దం తెలియదు.... అర్థం తెలియదు...పద్యం తెలియదు... ఆ పరమశివుడే నాకు సర్వస్వం అని ఈ శ్లోకానికి అర్థమని సమాచారం. ఒకే ఆయుధం....ఒకే లక్ష్యం.... ఒకే తీర్పు అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. శివుని కుమారుడు...పార్వతికి గర్వకారణం...దేవసేనాని అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కార్తికేయుడిగా...
పురాణాల స్ఫూర్తితో మైథలాజికల్ సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఇందులో ఎన్టీఆర్ యుద్ధ దేవుడైన కార్తికేయుడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు షణ్ముఖుడు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాధాకృష్ణతో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ పాన్ ఇండియన్ మూవీని నిర్మిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా గాడ్ ఆఫ్ వార్ తెరకెక్కుతోంది.
డ్రాగన్...
ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ యాక్షన్‌గా రానున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది.
The Son of Shiva.
The Pride of Parvathi.
The Eternal Commander.And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu
— Jr NTR (@tarak9999) June 29, 2026
సంబంధిత వార్తలు

Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి – కారణం ఇదేనా?
జూన్ 29, 2026

Sreeleela | యూట్యూబ్‌లో చరిత్రను సృష్టించిన మహేష్‌బాబు ,శ్రీలీల తెలుగు సాంగ్ – 800 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్
జూన్ 29, 2026

Movie Teaser | పొలిటికల్ లీడర్‌గా డిస్కో శాంతి కొడుకు – స్టూడెంట్ టీజర్ రిలీజ్
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Shabad Current Shock Death | కరెంట్ షాక్‌తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?
- ●Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు
- ●Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?
- ●Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..
- ●Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు

Shabad Current Shock Death | కరెంట్ షాక్‌తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు

Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!



