త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వ‌ధువుతో పాటు ఉరేసుకున్న త‌ల్లిదండ్రులు

Family Suicide | ఓ యువ‌కుడి వేధింపులు భ‌రించ‌లేక న‌వ వ‌ధువు విషం తాగి ఉరేసుకుంది. ఆమె త‌ల్లిదండ్రులు కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. పెళ్లికి ఒక రోజు ముందు ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో.. ఆ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది.

S

National | Published On Jun 23, 2026, 7.33 am IST

Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వ‌ధువుతో పాటు ఉరేసుకున్న త‌ల్లిదండ్రులు
Advertisement

Family Suicide | త్రినేత్ర‌.న్యూస్ : ఓ యువ‌కుడి వేధింపులు భ‌రించ‌లేక న‌వ వ‌ధువు విషం తాగి ఉరేసుకుంది. ఆమె త‌ల్లిదండ్రులు కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. పెళ్లికి ఒక రోజు ముందు ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో.. ఆ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క మైసూర్ జిల్లాలోని కెంప‌య్య‌న‌హుండి గ్రామానికి చెందిన ర‌క్షిత‌(21) స్థానికుడైన ఉల్లాస్ గౌడ‌తో స్నేహం చేసింది. ఇద్ద‌రూ క‌లిసి స‌న్నిహితంగా మెలిగారు. ఈ విష‌యం ర‌క్షిత త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌దు. దీంతో వారు ఆమెకు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. ర‌క్షిత కూడా పెద్ద‌లు కుదిర్చిన సంబంధానికి మొగ్గు చూపింది. పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. కానీ పెళ్లికి ముందు రోజు ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది.

అయితే ర‌క్షితకు వేరే యువ‌కుడితో పెళ్లి ఖాయ‌మైంద‌ని తెలుసుకున్న ఉల్లాస్ గౌడ ఆమెను వేధింపుల‌కు గురి చేశాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని, లేదంటే.. క‌లిసి దిగిన ఫొటోలు, స‌న్నిహితంగా మెలిగిన వీడియోల‌ను వ‌రుడికి పంపిస్తాన‌ని బెదిరింపుల‌కు గురి చేశాడు. చివ‌ర‌కు పంపించాడు కూడా.

ఈ క్ర‌మంలో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ర‌క్షిత‌, ఆమె త‌ల్లిదండ్రులు శివ‌న్న‌(50), నాగ‌ర‌త్న‌(45) దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు. ఉల్లాస్ గౌడ వేధింపులు తాళ‌లేక చివ‌ర‌కు ఆ ముగ్గురు ప్రాణాలు తీసుకోవాల‌నుకున్నారు. ఇక పెళ్లికి ముందు రోజు శివ‌న్న‌, నాగ‌ర‌త్న‌, ర‌క్షిత క‌లిసి విషం సేవించారు. అనంత‌రం ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే ర‌క్షిత బంధువులు ఈ ఘ‌ట‌న‌కు ఉల్లాస్ గౌడ‌నే కార‌ణ‌మ‌ని, అత‌న్ని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement