త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

France vs Iraq | ఎంబాప్పే మ్యాజిక్‌

France vs Iraq | ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే మ‌రోసారి మ్యాజిక‌ల్ ఫ‌ర్ఫార్మెన్స్‌తో అల‌రించాడు. తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌నతో మ‌రింత చిర‌స్మ‌ర‌ణీయంగా మార్చేశాడు. గ్రూప్ దశ పోరులో ఇరాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌బుల్ గోల్‌తో ఫ్రాన్స్‌ను 3-0 తేడాతో విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ వరుసగా రెండో విజ‌యం సాధించి నాకౌట్‌కు ద‌గ్గ‌రైంది.

P

Sports | Published On Jun 23, 2026, 7.33 am IST

France vs Iraq | ఎంబాప్పే మ్యాజిక్‌
Advertisement
  • ఫ్రాన్స్‌కు రెండో విజ‌యం
  • 3-0 తేడాతో ఇరాక్ ప‌రాజయం
  • డబుల్ గోల్‌తో మెరిసిన కిలియ‌న్
  • ప్ర‌పంచ‌క‌ప్ కెరీర్‌లో 15 గోల్స్‌తో రికార్డు

France vs Iraq | ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే మ‌రోసారి మ్యాజిక‌ల్ ఫ‌ర్ఫార్మెన్స్‌తో అల‌రించాడు. తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌నతో మ‌రింత చిర‌స్మ‌ర‌ణీయంగా మార్చేశాడు. గ్రూప్ దశ పోరులో ఇరాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌బుల్ గోల్‌తో ఫ్రాన్స్‌ను 3-0 తేడాతో విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ వరుసగా రెండో విజ‌యం సాధించి నాకౌట్‌కు ద‌గ్గ‌రైంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఫ్రాన్స్‌కు 14వ నిమిషంలో ఎంబాప్పే తొలి గోల్ అందించాడు. ఇరాక్ డిఫెన్స్ చేసిన చిన్న త‌ప్పును స‌ద్వినియోగం చేసుకున్న కెప్టెన్ దూరం నుంచే ఎడ‌మ‌కాలితో అద్భుత‌మైన షాట్ కొట్టి బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ప్ర‌పంచ‌క‌ప్ కెరీర్‌లో ఎంబాప్పేకు ఇది 15వ గోల్ కావ‌డం విశేషం.

ఉస్మాన్ పాస్‌తో..

ద్వితీయార్థం మొద‌లైన కొద్దిసేప‌టికి ఇరాక్ మ‌రోసారి త‌ప్పు చేయ‌డం ఫ్రాన్స్‌కు క‌లిసి వ‌చ్చింది. 54వ నిమిషంలో డిఫెండర్ జైద్ తహ్సీన్, గోల్‌కీపర్ అహ్మద్ బస్సిల్ మధ్య సమన్వయ లోపంతో బంతి ఉస్మాన్ డెంబెలేకు చేరింది. డెంబెలే గోల్ కోసం ప్ర‌య‌త్నించ‌కుండా.. ఎంబాప్పేకు పాస్ ఇవ్వ‌గా.. కెప్టెన్ సునాయాసంగా గోల్ చేసి జట్టుకు 2-0 ఆధిక్యం అందించాడు. ఈ గోల్‌తో ప్రపంచకప్‌లో ఎంబాప్పే గోల్స్ సంఖ్య 16కు చేరి జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజే రికార్డును సమం చేశాడు. 66వ నిమిషంలో ఫ్రాన్స్ మూడో గోల్ సాధించింది. మైఖేల్ ఒలిసే ఇచ్చిన అద్భుత పాస్‌ను డెంబెలే గోల్‌గా మలిచి స్కోరును 3-0కు చేర్చాడు. ప్రపంచకప్‌లో డెంబెలే ఖాతాలో నమోదైన తొలి గోల్ ఇదే కావడం విశేషం. మ్యాచ్ మొత్తం ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని కొన‌సాగించింది. ఫ్రాన్స్ మొత్తం 18 షాట్లు కొట్టగా, వాటిలో ఐదు లక్ష్యాన్ని తాకాయి. మరోవైపు ఇరాక్ ఒక్క షాట్‌ను కూడా గోల్‌పోస్ట్ దిశగా పంపలేకపోయింది. బంతిపై ఫ్రాన్స్ 56 శాతం ఆధిపత్యం కొనసాగించగా.. 585 పాస్‌లు పూర్తి చేసింది. వాటిలో 91 శాతం ఖచ్చితత్వం ఉండ‌డం విశేషం. ఇరాక్ 420 పాస్‌లు చేసినప్పటికీ ఫ్రాన్స్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

గోల్డెన్ బూట్ కోసం మెస్సీ–ఎంబాప్పే పోటీ

ప్రపంచకప్ గోల్డెన్ బూట్ రేసు ఆసక్తికరంగా మారుతోంది. ఆస్ట్రియాపై రెండు గోల్స్ సాధించిన అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం టోర్నీలో టాప్ గోల్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. ఎంబాప్పే నాలుగు గోల్స్‌తో రెండోస్థానంలో ఉన్నాడు. ఇప్పటికే ఇరుజట్లు నాకౌట్ దశకు చేరుకోవడంతో, ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీతో పాటు వ్యక్తిగత రికార్డులపై సైతం ఈ ఇద్దరు దిగ్గజాల క‌న్నుప‌డింది. గ్రూప్ దశలో ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించాయి. తదుపరి మ్యాచ్‌లో ఫ్రాన్స్ నార్వేతో తలపడనుండగా.. అర్జెంటీనా చివరి గ్రూప్ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.

Advertisement
Advertisement