త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunny Leone | రూ.2400కోట్ల స్కామ్‌.. స‌న్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు..!

Sunny Leone | బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఓ భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకున్న‌ది. క‌ర్నాట‌క‌లో వెలుగుచూసిన దాదాపు రూ.2,400 కోట్ల అక్రమ డిపాజిట్స్ స్కామ్‌లో ఆమె పేరు వెలుగులోకి రావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ‘శివమ్ అసోసియేట్స్’ అనే సంస్థ చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.

P

Entertainment | Published On Jun 9, 2026, 4.29 pm IST

Sunny Leone | రూ.2400కోట్ల స్కామ్‌.. స‌న్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు..!
Advertisement

Sunny Leone | బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఓ భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకున్న‌ది. క‌ర్నాట‌క‌లో వెలుగుచూసిన దాదాపు రూ.2,400 కోట్ల అక్రమ డిపాజిట్స్ స్కామ్‌లో ఆమె పేరు వెలుగులోకి రావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ‘శివమ్ అసోసియేట్స్’ అనే సంస్థ చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర్‌పై ఇప్పటికే కేసులు నమోదు కాగా.. విచారణలో భాగంగా క‌ర్నాట‌క సీఐడీ అధికారులు సన్నీ లియోన్‌కు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా సేకరించిన సొమ్ము వినియోగంపై దర్యాప్తు కొన‌సాగుతుండ‌డంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

పోలీసుల విచార‌ణ ప్ర‌కారం.. 2023లో శివమ్ అసోసియేట్స్ నిర్మించిన ‘ఛాంపియన్’ అనే కన్నడ సినిమాలో సన్నీ లియోన్ ఒక ఐటెం సాంగ్‌లో కనిపించారు. ఆ పాట కోసం ఆమెకు దాదాపు రూ.కోటి పారితోషికం చెల్లించినట్లు బ్యాంక్ రికార్డుల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులు ప్రజల నుంచి సేకరించిన అక్రమ డిపాజిట్ల నుంచే జరిగాయా అనే కోణంలో అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ మేర‌కు పూర్తి వివరాలు అందించాలంటూ సన్నీ లియోన్‌కు సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. ఇక ఇదే సంస్థ గత డిసెంబర్‌లో నిర్వహించిన ‘కన్నడ ఉత్సవం’ కార్యక్రమం సైతం నిర్వ‌హించింది. ఈ ఈవెంట్‌లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వారికి సైతం భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ చెల్లించిన‌ట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. వారికి చెల్లించింది డిపాజిట‌ర్ల సొమ్మేణా అని తెలుసుకునేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్రమంలో కన్నడ సినీ రంగానికి చెందిన నటులు ‘డాలి’ ధనుంజయ్, సప్తమీ గౌడ (కాంతార ఫేమ్), వశిష్ఠ సింహ, రాగిణి ద్వివేదిలకు కూడా త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారం సినిమా రంగం, వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement