Norway vs Senegal | నాకౌట్‌లోకి నార్వే
Norway vs Senegal | స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ మరోసారి సత్తాచాటాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రెండు గోల్స్ సాధించి.. నార్వేకు కీలక విజయాన్ని అందించాడు. మెట్‌లైఫ్ స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్-ఐ మ్యాచ్‌లో సెనెగల్‌పై 3-2 తేడాతో విజయం సాధించిన నార్వే, ఫిఫా ప్రపంచకప్-2026 నాకౌట్ దశకు అర్హత సాధించింది.
- సెనెగల్‌పై 3-2తో ఘన విజయం
- తప్పులతో ఓటమి తెచ్చుకున్న జట్టు
- మళ్లీ డబుల్ గోల్‌తో మెరిసిన హాలాండ్
- ఫ్రాన్స్‌తో సమంగా నిలిచిన నార్వే
Norway vs Senegal | స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ మరోసారి సత్తాచాటాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రెండు గోల్స్ సాధించి.. నార్వేకు కీలక విజయాన్ని అందించాడు. మెట్‌లైఫ్ స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్-ఐ మ్యాచ్‌లో సెనెగల్‌పై 3-2 తేడాతో విజయం సాధించిన నార్వే, ఫిఫా ప్రపంచకప్-2026 నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఈ విజయంతో నార్వే ఆరు పాయింట్లతో గ్రూప్ అగ్రస్థానంలో ఉన్న ఫ్రాన్స్‌తో సమానంగా నిలిచింది. ఈ నెల 27న ఫ్రాన్స్-నార్వే మ్యాచ్ కీలకం కానుంది.
43వ నిమిషంలో తొలి గోల్..

మ్యాచ్ తొలిభాగంలో నార్వే ఆధిపత్యం ప్రదర్శించింది. స్కాండినేవియన్ జట్టు 43వ నిమిషంలో ఆధిక్యంలోకి వెళ్లింది. సెనెగల్ డిఫెన్స్ ఏసిన చిన్న పొరపాటును సద్వినియోగం చేసుకున్న మార్కస్ పెడర్సెన్, పెనాల్టీ బాక్స్‌లోకి దూసుకెళ్లి పవర్‌ఫుల్ షాట్‌తో గోల్ సాధించాడు. గోల్‌కీపర్ ఎడ్వర్డ్ మెండీ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి నార్వే ఆధిక్యాన్ని మరింత పెంచేందుకు అవకాశాలు వచ్చాయి. అయితే, మెండీ చేసిన కీలక సేవ్స్, హాలాండ్ షాట్ పోస్ట్‌ను తాకడంతో స్కోర్ 1-0 వద్దే ఆగిపోయింది. రెండో అర్ధభాగం మొదలైన మూడు నిమిషాలకే హాలాండ్ తొలి గోల్ వేశాడు. మార్టిన్ ఓడెగార్డ్ అందించిన అద్భుత త్రూ బాల్‌ను రిసీవ్ చేసుకొని.. చక్కటి ఫినిషింగ్‌తో బంతిని గోల్‌పోస్ట్ ఎగువ మూలలోకి పంపాడు. దాంతో స్కోరు 2-0కి చేరింది. ఆ తర్వాత సెనగల్ సైతం తేరుకొని ధీటుగా బదులిచ్చింది. 53వ నిమిషంలో సాడియో మానే ఇచ్చిన అద్భుత పాస్‌ను ఇస్మాయిలా సార్ గోల్‌గా మలిచి తేడాను 2-1కు తగ్గించాడు. 58వ నిమిషంలో సెనెగల్ డిఫెన్స్ మరోసారి తబడింది. ప్యాట్రిక్ బెర్గ్ అందించిన క్రాస్‌ను హాలాండ్ అద్భుతమైన ఫస్ట్‌టైమ్ వాలీతో గోల్‌గా మార్చాడు. క్రాస్‌బార్‌ను తాకిన బంతి నెట్‌లో పడడంతో స్కోరు 3-1గా మారింది. ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనే హాలాండ్ నాలుగు గోల్స్ పూర్తి చేశాడు.
ఆశలు రేకెత్తించినా..

ఇంజ్యురీ టైమ్‌లో ఇస్మాయిలా సార్ మరో గోల్ సాధించి సెనెగల్‌లో ఆశలు రేకెత్తించాడు. చివరి వరకు నార్వే ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ విజయంతో నార్వే నాకౌట్ దశలో చోటు ఖాయం చేసుకోగా, గ్రూప్ అగ్రస్థానం కోసం ఫ్రాన్స్‌తో తలపడనుంది. మరోవైపు సెనెగల్ మాత్రం తర్వాతి మ్యాచ్‌లో ఇరాక్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితిని నెలకొంది. టోర్నీలో వరుసగా గోల్స్ వర్షం కురిపిస్తున్న హాలాండ్, గోల్డెన్ బూట్ రేసులో నిలిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే నాలుగు గోల్స్ వేసి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాబోయే మ్యాచుల్లో ఇదే ఆటతీరును కొనసాగిస్తే గోల్డెన్ బూట్ దక్కినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cow | ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన ఆవు తల.. ఓ నిమిషం ఆగమాగం.. వీడియో
- ●ICC | మాతృత్వం ఇక అడ్డంకి కాదు.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భరోసా..!
- ●Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వధువుతో పాటు ఉరేసుకున్న తల్లిదండ్రులు
- ●France vs Iraq | ఎంబాప్పే మ్యాజిక్
- ●Qatar | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు మృతి
- ●Argentina Vs Austria | మెస్సీ డబుల్.. నాకౌట్‌కు అర్జెంటినా

Cow | ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన ఆవు తల.. ఓ నిమిషం ఆగమాగం.. వీడియో

ICC | మాతృత్వం ఇక అడ్డంకి కాదు.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భరోసా..!

Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వధువుతో పాటు ఉరేసుకున్న తల్లిదండ్రులు

France vs Iraq | ఎంబాప్పే మ్యాజిక్





