ICC | మాతృత్వం ఇక అడ్డంకి కాదు.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భరోసా..!
ICC | మహిళా క్రికెటర్ల కెరీర్‌కు మాతృత్వం అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసవం అనంతరం మహిళా ప్లేయర్స్ సురక్షితంగా, దశలవారీగా మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన క్రీడా జీవితం రెండింటినీ సమతుల్యం చేసుకునేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు ఐసీసీ వెల్లడించింది.
ICC | మహిళా క్రికెటర్ల కెరీర్‌కు మాతృత్వం అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసవం అనంతరం మహిళా ప్లేయర్స్ సురక్షితంగా, దశలవారీగా మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన క్రీడా జీవితం రెండింటినీ సమతుల్యం చేసుకునేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ కొత్త విధానంలో భాగంగా ‘6-ఆర్’ (6R) మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సిద్ధత (Ready), సమీక్ష (Review), శారీరక పునరుద్ధరణ (Restore), ఫిట్‌నెస్ పునర్నిర్మాణం (Recondition), పునరాగమనం (Return), నైపుణ్యాల మెరుగుదల (Refine) అనే ఆరు దశలను నిర్దేశించింది. ప్రసవం తర్వాత శారీరక, మానసికంగా కోలుకునే ప్రక్రియ నుంచి తిరిగి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే వరకు ఆటగాళ్లకు అవసరమైన సహాయాన్ని ఈ ప్రణాళికలో పొందుపరిచారు.
ఈ మార్గదర్శకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా జట్టు వైద్యురాలు, ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు డాక్టర్ ఫిలిప్పా ఇంగే మాట్లాడుతూ.. బిడ్డకు జన్మనివ్వడం ఒక క్రీడాకారిణి కెరీర్‌కు ముగింపు కాదనే సందేశాన్ని బలంగా చాటడమే దీని లక్ష్యమన్నారు. వివిధ దేశాల క్రికెట్ బోర్డుల్లో మాతృత్వానికి సంబంధించి ఏకరీతి విధానాలు లేకపోవడంతో, అన్ని బోర్డులు తమ అవసరాలకు అనుగుణంగా అనుసరించగలిగేలా ఈ మార్గదర్శకాలను రూపొందించామని చెప్పారు. ప్రతి గర్భిణీ క్రీడాకారిణికి ప్రత్యేకంగా ఒక ‘కేస్ మేనేజర్’ను నియమించాలని ఐసీసీ సిఫార్సు చేసింది. సాధారణంగా వైద్యుడు, ఫిజియోథెరపిస్ట్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గర్భధారణ ప్రారంభమైన దశ నుంచి మళ్లీ మైదానంలోకి వచ్చే వరకు ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు అవసరమైన సమన్వయం చేయనున్నారు.
అంతేకాకుండా వైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్టులు, స్పోర్ట్స్ సైకాలజిస్టులు, పోషకాహార నిపుణులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులతో కూడిన సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆటగాళ్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. గర్భధారణ విషయంలో మహిళా క్రీడాకారిణుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఐసీసీ స్పష్టం చేసింది. గర్భం దాల్చిన విషయాన్ని ఎప్పుడు, ఎలా వెల్లడించాలనేది పూర్తిగా ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమేనని తెలిపింది. సభ్య దేశాల క్రికెట్ బోర్డులు తప్పనిసరి గర్భధారణ పరీక్షలు నిర్వహించకూడదని ఆదేశించింది. గర్భధారణ సమయంలో తగిన వైద్య పర్యవేక్షణలో వ్యాయామం కొనసాగించవచ్చని సూచించినప్పటికీ, శిక్షణ లేదా పోటీల్లో పాల్గొనే అంశాలపై వైద్యుల సలహాల మేరకే నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. తొలి మూడు నెలల తర్వాత పోటీలకు దూరంగా ఉండటం సాధారణంగా మంచిదని సూచించినా, దానిపై కఠిన నిబంధనలు విధించలేదు.
2021లో తల్లిగా మారిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ అఫీ ఫ్లెచర్ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. తల్లిగా మారిన తర్వాత మైదానంలోకి తిరిగి రావడం సవాలుతో కూడుకున్న ప్రక్రియేనని, ముఖ్యంగా చిన్నారిని వదిలి ప్రయాణించడం భావోద్వేగపరంగా కష్టమైందని ఆమె పేర్కొంది. సరైన మద్దతు, ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు మళ్లీ అత్యున్నత స్థాయిలో రాణించగలరని ఆమె అభిప్రాయపడింది.మహిళా క్రికెటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శిశు సంరక్షణ సదుపాయాలు, పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక గదులు, ప్రయాణాల్లో పిల్లలతో పాటు వెళ్లేందుకు అవసరమైన సౌకర్యాలు, శిక్షణా కేంద్రాల్లో అనుకూల వాతావరణం కల్పించాలని కూడా ఐసీసీ సూచించింది. మహిళా క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇస్తూనే వారి కెరీర్‌కు భరోసా కల్పించే దిశగా ఈ మార్గదర్శకాలు కీలక మైలురాయిగా నిలవనున్నాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Norway vs Senegal | నాకౌట్లోకి నార్వే
- ●Cow | ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన ఆవు తల.. ఓ నిమిషం ఆగమాగం.. వీడియో
- ●Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వధువుతో పాటు ఉరేసుకున్న తల్లిదండ్రులు
- ●France vs Iraq | ఎంబాప్పే మ్యాజిక్
- ●Qatar | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు మృతి
- ●Argentina Vs Austria | మెస్సీ డబుల్.. నాకౌట్‌కు అర్జెంటినా









