Daughter Killed Mother | సర్కారు కొలువు కోసం కన్నతల్లి హత్య.. రూ.7 లక్షల సుపారీ..
Daughter Killed Mother | మనుషుల్లో రోజురోజుకు మానవత్వం నషిస్తున్నది. తన పర అనే బేధాలు లేకుండా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆస్తి కోసం ఒకరు, బీమా డబ్బు కోసం మరొకరు, ప్రేయుడి, ప్రేయసి కోసం కట్టుకోబోయేవాడిని, కట్టుకునోళ్లను కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని (Rajasthan) ప్రతాప్‌నగర్‌లో చోటుచేసుకుంది.
Daughter Killed Mother | త్రినేత్ర.నూస్: మనుషుల్లో రోజురోజుకు మానవత్వం నషిస్తున్నది. తన పర అనే బేధాలు లేకుండా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆస్తి కోసం ఒకరు, బీమా డబ్బు కోసం మరొకరు, ప్రేయుడి, ప్రేయసి కోసం కట్టుకోబోయేవాడిని, కట్టుకునోళ్లను కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని (Rajasthan) ప్రతాప్‌నగర్‌లో చోటుచేసుకుంది. తల్లిని (Daughter Killed Mother) చంపేందుకు రూ.7 లక్ష సుపారీ ఇచ్చి, ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కూతురు.. చివరకు పోలీసులకు చిక్కింది.
ప్రతాప్‌నగర్‌లోని రవీంద్రనగర్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ, నీరజ్ శర్మ (45) దంపతులు. విజయ్ కుమార్ కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్‌గా (LDC) పనిచేసేవారు. వారికి కూతురు ఆయుషి (23) ఉన్నది. ఏడాది క్రితం విజయ్ కుమార్ మృతిచెందారు. దీంతో కారుణ్య నియామకం కింద నీరజ్ శర్మ ఎల్‌డీసీగా ఉద్యోగం పొందారు. అయితే ఆ ఉద్యోగం తనకు దక్కాలని కుమార్తె ఆయుషి ఆశించింది. తల్లి ఒప్పుకోకపోవడంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న కూతురు.. ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగంతోపాటు (Government Job) ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని అనుకుంది.

ఇందులో భాగంగా తమ సమీప బంధువలతో కలిసి కుట్రపన్నింది. తండ్రి తరపు బంధువు అయిన మోహన్ స్వరూప్‌తో కలిసి హేమంత్ శర్మ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌ను (Contract Killers) కలిసింది. నీరజ్‌ను చంపేందుకు రూ.7 లక్షల సుపారీ ఇచ్చింది. ఒప్పందం మేరకు ఆమెను ఈ నెల 3న సాయంత్రం 4.45 గంటలకు తన దివ్యాంగుడైన కుమారుడిని కోచింగ్ క్లాస్ వద్ద వదిలి వస్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ ఎస్‌యూవీ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె 100 అడుగుల దూరంలో పడిపోయింది. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. అయితే నీరజ్ మృతిపై అనుమానంతో ఆమె సోదరుడు రాకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి మరణానంతరం ప్రభుత్వం ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగాన్ని తల్లి తీసేసుకుందనే కక్షతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కాలన్న దుర్బుద్ధితో ఆయుషి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. తనపై అనుమానం రాకుండా ఆమె మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు నిర్ధారించారు. యువతిని సహా నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ●Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?
- ●DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్
- ●Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?
- ●MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
- ●IPS Molest | నేషనల్ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?

DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్

Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?

MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి






