Air Pollution | సంతానోత్పత్తిపైనే కాదు.. భావితరాలపైనా వాయు కాలుష్యం ముప్పు!
Air Pollution | వాయు కాలుష్యం ప్రభావం కేవలం ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యానికే పరిమితం కాదని తాజా అధ్యయనం వెల్లడించింది. కలుషిత గాలికి ఎక్కువకాలం గురయ్యే పురుషుల వీర్యకణాల డీఎన్‌ఏలో ఎపిజెనెటిక్ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్ పరిశోధనల్లో ఈ ఫలితాలు మరింత బలపడితే, పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై మాత్రమే కాకుండా, రాబోయే తరాల ఆరోగ్యంపైనా వాయు కాలుష్యం ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- పుట్టబోయే సంతానంపై వాయు కాలుష్యం ప్రభావం..!
- పురుషుల వీర్యకణాల డీఎన్‌ఏల్లో మార్పులు
- రాబోయే తరాల ఆరోగ్యంపై ప్రభావం తప్పదని హెచ్చరిక
- హ్యూమన్ రిప్రొడక్షన్‌లో అధ్యయనం వెల్లడి
Air Pollution | వాయు కాలుష్యం ప్రభావం కేవలం ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యానికే పరిమితం కాదని తాజా అధ్యయనం వెల్లడించింది. కలుషిత గాలికి ఎక్కువకాలం గురయ్యే పురుషుల వీర్యకణాల డీఎన్‌ఏలో ఎపిజెనెటిక్ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్ పరిశోధనల్లో ఈ ఫలితాలు మరింత బలపడితే, పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై మాత్రమే కాకుండా, రాబోయే తరాల ఆరోగ్యంపైనా వాయు కాలుష్యం ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనాన్ని ‘యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ (ESHRE)’ నిర్వహించిన 42వ వార్షిక సదస్సులో వెల్లడించారు. పరిశోధన వివరాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ‘హ్యూమన్ రిప్రొడక్షన్’లో కూడా ప్రచురితమయ్యాయి. అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో 2013 నుంచి 2017 మధ్య ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో 2వేల మందికిపైగా పురుషులను భాగస్వాములుగా తీసుకుని.. వివిధ దశల్లో స్పెర్మ్ నమూనాలు సేకరించారు. వారిలో 1,220 మంది నమూనాలను దాదాపు ఆరు నెలల తర్వాత విశ్లేషించి పరిశోధన చేపట్టారు.
డీఎన్‌ఏలో ఎలాంటి మార్పులు?
పరిశోధకులు వీర్యకణాల్లో జరిగే ‘డీఎన్‌ఏ మెథిలేషన్’ అనే ఎపిజెనెటిక్ ప్రక్రియను పరిశీలించారు. డీఎన్‌ఏ అసలు నిర్మాణంలో మార్పు లేకుండానే జన్యువుల పనితీరును నియంత్రించే ప్రక్రియనే డీఎన్‌ఏ మెథిలేషన్ అంటారు. ఈ పరిశోధనలో ఓజోన్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, పీఎం2.5 వంటి ప్రధాన వాయు కాలుష్య కారకాల ప్రభావాన్ని విశ్లేషించారు. ఫలితాల్లో వీర్యకణాల డీఎన్‌ఏలోని 39 ప్రాంతాల్లో మెథిలేషన్ మార్పులు కనిపించినట్లు గుర్తించారు. వీటిలో ముఖ్యంగా ఓజోన్, నైట్రోజన్ డైఆక్సైడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తండ్రి వీర్యకణాల్లో ఇలాంటి ఎపిజెనెటిక్ మార్పులు జరిగితే.. అవి కేవలం గర్భధారణ వరకే పరిమితమవుతాయా? లేక పుట్టబోయే శిశువు ఆరోగ్యం, ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతాయా? అనే అంశంపై మరింత లోతైన పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వీర్యకణాల అభివృద్ధిపై ప్రభావం
ఈ మార్పులు నమోదైన జన్యువులు వీర్యకణాల ఉత్పత్తి, క్రోమోజోమ్‌ల అమరిక, కణాల రక్షణ వంటి కీలక జీవ ప్రక్రియలతో సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. వీటిలో జీఎన్‌ఏఎస్ (GNAS) జన్యువులో గుర్తించిన మార్పులు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పిండం ప్రారంభ దశలో ఎదుగుదలకు ఈ జన్యువు కీలక పాత్ర పోషిస్తుంది. గత అధ్యయనాల్లో కూడా ఈ జన్యువుకు వీర్యకణాల నాణ్యత, పిండం సాధారణ అభివృద్ధితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు






