Road Accident | చిట్యాల సమీపంలో కారును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. బాలుడు సహా నలుగురు దుర్మరణం
Road Accident | నల్లగొండ (Nalgonda) జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చిట్యాల (Chityal) నుంచి హైదరాబాద్ (Hyderabad) వైపు వస్తున్నకారును పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారిపై (National Highway) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) ఢీకొట్టింది.
Road Accident | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ (Nalgonda) జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చిట్యాల (Chityal) నుంచి హైదరాబాద్ (Hyderabad) వైపు వస్తున్నకారును పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారిపై (National Highway) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 ఏండ్ల బాలుడు సహా నలుగురు వ్యక్తలు అక్కడికక్కడే మృతిచెందారు.

ఆదివారం తెల్లవారుజామున చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు ఒక కారు బయలుదేరింది. పెద్దకాపర్తి (Peddha kaparthi) సమీపంలోకి రాగానే, అదే మార్గంలో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (OD 10 Q 6786) కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జు అయింది. మరణించిన వారిలో బస్సు డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు, బాలుడు ఉన్నట్లు సమాచారం.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టంపై బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించిన పోలీసులు.. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు





