త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dalai Lama | దలైలామాకి గ్రామీ అవార్డ్.. 90 ఏళ్ల వ‌య‌సులో రికార్డు క్రియేట్ చేసిన బౌద్ధ‌మ‌త గురువు

Dalai Lama | టిబెట్ బౌద్ధ‌మ‌త గురువు ( Tibetan spiritual leader) ద‌లైలామా (Dalai Lama)కు గ్రామీ అవార్డు వ‌రించింది.

D

National | Published On Feb 2, 2026, 10.21 am IST

Dalai Lama | దలైలామాకి గ్రామీ అవార్డ్.. 90 ఏళ్ల వ‌య‌సులో రికార్డు క్రియేట్ చేసిన బౌద్ధ‌మ‌త గురువు
Advertisement

Dalai Lama | సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల (Grammy Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం వేదికగా జ‌రుగుతున్న‌ ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గాయనీ గాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది సంగీత రంగంలో విశేష కృషి చేసిన కళాకారులు, గాయకులు, స్వరకర్తలు, సాంకేతిక నిపుణులను ఈ వేడుక‌లో స‌త్క‌రిస్తున్నారు.

అయితే, ఈ సారి గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో ఓ రికార్డు బ్రేక్ అయ్యింది. టిబెట్ బౌద్ధ‌మ‌త గురువు ( Tibetan spiritual leader) ద‌లైలామా (Dalai Lama)కు గ్రామీ అవార్డు వ‌రించింది. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్‌ విభాగంలో మెడిటేష‌న్ (Meditations: The Reflections of His Holiness the Dalai Lama) అనే ఆల్బ‌మ్‌కు గానూ ఆయనకు గ్రామీ అవార్డు దక్కింది. ఆధ్యాత్మిక సందేశాలు, శాంతి, మానవ విలువలపై ఆయన అందించిన ఆడియో బుక్‌కు ఈ అవార్డు లభించడం విశేషం. 90 ఏళ్ల వ‌య‌సులో ఈ అవార్డు అందుకొని ద‌లైలామా రికార్డు సృష్టించారు.

Advertisement
Advertisement