Dalai Lama | ఎపిస్టీన్ ఫైల్స్‌తో నాకు సంబంధం లేదు.. ఖండించిన దలైలామా..
Dalai Lama | అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎపిస్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని బౌద్ధ గురువు దలైలామా ఖండించారు. తనను ఎపిస్టీన్ తో అనుసంధానించే మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు పూర్తిగా అసత్యమని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.
International | Published On Feb 8, 2026, 11.51 am IST
Dalai Lama | అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎపిస్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని బౌద్ధ గురువు దలైలామా ఖండించారు. తనను ఎపిస్టీన్ తో అనుసంధానించే మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు పూర్తిగా అసత్యమని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. ఎపిస్టీన్ కు సంబంధించిన తాజా పత్రాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు, ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లు చర్చకు రావడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే దలైలామా ఎపిస్టీన్ ను ఎప్పుడూ కలవలేదని, తన తరఫున ఎవరైనా ఆయనతో సమావేశం కావడానికి అనుమతి కూడా ఇవ్వలేదని స్పష్టంగా పేర్కొన్నారు.
ఎపిస్టీన్ ఫైళ్లకు సంబంధించి కొన్ని మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు దలైలామాను జెఫ్రీ ఎపిస్టీన్ తో అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆయన ఎపిస్టీన్ ను ఎప్పుడూ కలవలేదు. అలాగే తన తరఫున ఎవరైనా ఆయనతో సమావేశం కావడానికి అనుమతి కూడా ఇవ్వలేదు.. అని దలైలామా కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనను దలైలామా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనూ షేర్ చేశారు.
Press Statement
Some recent media reports and social media posts concerning the “Epstein files” are attempting to link His Holiness the Dalai Lama with Jeffrey Epstein.
We can unequivocally confirm that His Holiness has never met Jeffrey Epstein or authorised any meeting or… pic.twitter.com/QtV6B3Wr0u
— Dalai Lama (@DalaiLama) February 8, 2026
గత నెలలో అమెరికా న్యాయశాఖ జెఫ్రీ ఎపిస్టీన్ కు సంబంధించిన పత్రాలను భారీ ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ ఫైల్స్‌లో సుమారుగా 3 మిలియన్లకు పైగా డాక్యుమెంట్లు, 2వేలకు పైగా వీడియోలు, సుమారుగా 1.80 లక్షలకు పైగా ఫొటోలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ ఫైల్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల పేర్లను చాలా సార్లు ప్రస్తావించినట్లు అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అయితే ఎపిస్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు కూడా ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కార్యాలయం ఆ వార్తలను ఖండించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






