CRPF Constable | సీఆర్‌పీఎఫ్‌లో 9195 కానిస్టేబుల్ పోస్టులు.. పదో తరగతి అర్హత
CRPF Constable | భద్రతా దళాల్లో పనిచేయాలనుకునే వారికి కేంద్ర హోంశాఖ (CRPF Constable) తీపి కబురు అందించింది. కేంద్ర ప్రత్యేక బలగాల్లో ఒకటైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో ఖాళీగా ఉన్న 9195 కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
CRPF Constable | త్రినేత్ర.న్యూస్: భద్రతా దళాల్లో పనిచేయాలనుకునే వారికి కేంద్ర హోంశాఖ (CRPF Constable) తీపి కబురు అందించింది. కేంద్ర ప్రత్యేక బలగాల్లో ఒకటైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో ఖాళీగా ఉన్న 9195 కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ఐటీఐ అర్హత కలిగినవారు అర్హులు. ఏప్రిల్ 20 నుంచి ఆన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. రాతపరీక్ష, పీఈటీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రతి నెల రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం అందుకోవచ్చు. మొత్తం ఖాళీల్లో తెలంగాణకు 356, ఆంధ్రప్రదేశ్‌కు 504 పోస్టులు కేటాయించారు.
మొత్తం ఖాళీలు: 9195
- కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్ అం టెక్నికల్)- 9175.
- వీటిలో పురుషులకు 9096, మహిళలకు 79 పోస్టులు కేటాయించారు.
- కానిస్టేబుల్ (పయనీర్ వింగ్)- 20.

అర్హతలు
పదో తరగతి, ఇంటర్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డు వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- మోటార్ మెకానిక్ వెహికల్.. సంబంధిత విభాగంలో రెండేండ్ల ఐటీఐతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
- పయనీర్ వింగ్ (మేసన్/ ఎలక్ట్రీషియన్).. సంబంధిత ట్రేడులో ఏడాది అనుభవం తప్పనిసరి, ఐటీఐ పూర్తి చేసినవారిని ప్రాధాన్యం.
- డ్రైవర్ పోస్టులకు.. హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్థులు 21 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PST/PET), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ట్రేడ్/ స్కిల్‌టెస్ట్ (Trade Test), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అయితే తుది మెరిట్ లిస్ట్ సీబీటీ మార్కుల ఆధారంగానే ఉంటుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)
ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు, గిరిజన ప్రాంతాల వారికి నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది. ఛాతీ సాధారణ స్థితిలో కనీసం 80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. విస్తరించాలి (పురుషులకు మాత్రమే).
పరీక్ష విధానం
కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లేదా హిందీ నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు 10వ తరగతి స్థాయిలోనే అడుగుతారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 20
దరఖాస్తులకు చివరి తేదీ: మే 19
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
వెబ్‌సైట్: crpf.gov.in
పూర్తి వివరాలకు..
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



